ఆదిపురుష్ సినిమా కోసం ఓం రౌత్ ప్రత్యేక శ్రద్ద!

Thursday, April 1st, 2021, 08:41:26 AM IST

యంగ్ రెబల్ స్టార్, బాహుబలి ప్రభాస్ నటిస్తున్న తాజా చిత్రం ఆదిపురుష్. ఈ చిత్రం షూటింగ్ ప్రస్తుతం ముంబై లో శరవేగంగా జరుగుతుంది. అయితే ముంబై లో కరోనా వైరస్ మహమ్మారి తీవ్రత గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. దేశంలో ఎక్కువగా కరోనా కేసులు నమోదు అవుతున్న ప్రాంతాల్లో ముందు స్థానం లో ఉంది. అయినప్పటికీ చిత్ర యూనిట్ షూటింగ్ లో పాల్గొంటూనే ఉంది. ఇప్పటికే బాలీవుడ్ స్టార్ హీరో లు సైతం కరోనా వైరస్ భారిన పడిన వారే. అయితే సెట్ లో ఏ ఒక్కరికీ కూడా కరోనా వైరస్ సోకుకుండా ఉండేందుకు దర్శకుడు ఓం రౌత్ తగు చర్యలు తీసుకుంటున్నారు. షూటింగ్ స్పాట్ లో 25 మంది కంటే ఎక్కువగా ఉండటానికి వీల్లేదు అని చెప్పినట్లు తెలుస్తోంది. అంతేకాక షూటింగ్ ముగిసిన అనంతరం సెట్ మొత్తాన్ని కూడా శానిటైజ్ చేస్తున్నారు.

అయితే ఇలా కరోనా వైరస్ సోకకుండా పలు జాగ్రత్త చర్యలు తీసుకుంటూ చిత్ర షూటింగ్ ను జరుపుతున్నారు. అయితే ఈ సినిమా సెకండ్ షెడ్యూల్ వచ్చే నెల రెండో వారం వరకూ ముంబై లో జరుగుతుంది. ఈ చిత్రం పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. రాముడు పాత్రలో ప్రభాస్, సీత పాత్ర లో కృతి సనన్, రావణుడు పాత్రలో సైఫ్ అలీఖాన్ నటిస్తున్నారు. ప్రభాస్ రాధే శ్యామ్ విడుదల కి సిద్దం అవుతుండగా, ఏక కాలం లో అటు సలార్ ఇటు ఆదిపురుష్ చిత్రాలతో ప్రభాస్ బిజీగా ఉన్నారు. ఆదిపురుష్ వచ్చే ఏడాది ఆగస్ట్ 11 న విడుదల కానున్న సంగతి అందరికి తెలిసిందే.