ప్రజలకు సేవ చేసే ఉద్దేశ్యమే లేదు – ఆర్జీవీ

Thursday, May 13th, 2021, 04:22:46 PM IST


వివాదాల దర్శకుడు రాంగోపాల్ వర్మ తాజాగా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూ లో పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రజలకు సేవ చేసే ఉద్దేశ్యమే తనకు లేదని చెప్పుకొచ్చారు. ఇటీవల తరచూ రాజకీయాల పై, రాజకీయ నాయకుల పై తనదైన శైలి లో విమర్శలు చేస్తున్నారు రామ్ గోపాల్ వర్మ. అయితే రాజకీయాల్లోకి వచ్చే అవకాశం ఉందా అని ఒక విలేకరి వేసిన ప్రశ్న కి రామ్ గోపాల్ వర్మ ఇలా సమాధానం ఇచ్చారు.

నో, నేను రాజకీయాల్లోకి రావాలనుకోవడం లేదని అన్నారు.ఎందుకంటే జనాలకు సేవ చేసే ఉద్దేశ్యమే లేదని స్పష్టం చేశారు. నాకు నేను సేవ చేసుకోవడానికే టైమ్ సరిపోవడం లేదని అన్నారు. అయితే ప్రజలకు సేవ చేసే ఉద్దేశ్యం ఉన్నవాళ్ళే రాజకీయాల్లోకి వస్తారు అని వ్యాఖ్యానించారు. అది నేను కాదు అని అన్నారు. అంతేకాక సహజం గా ఏ నేత అయినా ఫేం, పవర్ కోసమే రాజకీయాల్లోకి అడుగు పెడతాడు అంటూ చెప్పుకొచ్చారు. కానీ, ఆ విషయాన్ని బయటికి చెప్పలేక ప్రజా సేవ అని పైకి చెబుతుంటాడు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.