స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా, రష్మికా మందన్నా హీరోయిన్గా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా “పుష్ప”. ఏప్రిల్ 8 అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా ‘ఇంట్రడ్యూసింగ్ పుష్పరాజ్’ పేరుతో చిత్ర యూనిట్ సినిమా టీజర్‌ను విడుదల చేసింది. అయితే ఇప్పటికే విడుదలైన పోస్టర్స్‌లో ఊర మాస్ గెటప్‌లో కనిపించి ఆకట్టుకున్న ‘పుష్ప’ రాజ్ తాజాగా విడుదలైన టీజర్లో కూడా అదే మాస్ గెటప్‌లో కనబడ్డాడు.
అయితే చిత్తూరు జిల్లా నేపథ్యంలో ఎర్రచందనం అక్రమ రవాణా కథాంశంగా ఈ సినిమా తెరకెక్కుతుంది. అడవుల్లో ఎర్ర చందనం స్మగ్లింగ్ చేసేవారిని పట్టుకోవడానికి ఫారెస్ట్ ఆఫీసర్స్ వెంట పడటం, వారి నుంచి తప్పించుకోవడానికి విజిల్స్ ద్వారా సంజ్ఞలు ఇచ్చుకుంటూ పారిపోవడం, మంచి యాక్షన్ సీన్స్‌తో పాటు చిత్తూరు యాసలో’ తగ్గేదే..లే” అని బన్నీ చెప్పే డైలాగ్ అదుర్స్ అనిపించింది. ఇక టీజర్లో బీజీఎం, యాక్షన్ సీన్స్‌తో పాటుగా నిర్మాణ విలువలు కూడా బాగున్నాయి. అయితే సినిమా ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న పుష్ప రాజ్ అభిమానులకు ఈ టీజర్ సినిమాపై వారికున్న అంచనాలను మరింత రెట్టింపు చేసింది. తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో ఆగస్టు 13న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.