శంకర్ సినిమా లో రామ్ చరణ్ ముఖ్యమంత్రి పాత్రలో?

Monday, March 29th, 2021, 09:30:39 AM IST

విభిన్న సినిమాలతో దర్శకుడు గా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు శంకర్. శంకర్ దర్శకత్వం లో రామ్ చరణ్ హీరో గా సినిమా రానున్న సంగతి తెలిసిందే. అయితే సామాజిక అంశాల పై, రాజకీయాల పై శంకర్ తీసిన ప్రతి సినిమా కూడా ప్రేక్షక ఆదరణ పొందాయి. ముఖ్యంగా అర్జన్ తో తీసింటువంటి ఒకే ఒక్కడు చిత్రం తో శంకర్ కి యావత్ భారత దేశం అంతటా నుండి క్రేజ్ పెరిగిపోయింది. అయితే అందులో హీరో అర్జున్ ముఖ్యమంత్రి పాత్ర లో నటించిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు రామ్ చరణ్ హీరో గా పొలిటికల్ బ్యాక్ డ్రాప్ గా సినిమా చేసేందుకు సిద్దం అయ్యారు శంకర్. అయితే ఈ సినిమా లో రామ్ చరణ్ ముఖ్యమంత్రి గా కనిపిస్తారా అనే అంశం పై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

చరణ్ మరియు శంకర్ కాంబినేషన్ లో దిల్ రాజు సినిమా ను నిర్మించేందుకు సిద్దం అయ్యారు. పాన్ ఇండియా మూవీ గా తెరకెక్కుతున్న ఈ చిత్రం షూటింగు త్వరలో ప్రారంభం కానుంది. అయితే రామ్ గోపాల్ ముఖ్యమంత్రి పాత్రలో కనపడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఒక వేళ అదే నిజమైతే సినిమా పై అంచనాలు మరొక స్థాయికి వెళ్ళే అవకాశం ఉంది. మరి దీని పై ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది.