యూట్యూబ్‌లో మరో రికార్డ్ క్రియేట్ చేసిన “సారంగ దరియా” సాంగ్..!

Saturday, April 24th, 2021, 01:40:52 AM IST

అక్కినేని నాగచైతన్య, సాయి పల్లవి జంటగా క్లాసిక్ అండ్ రొమాంటిక్ మూవీస్ దర్శకుడు శేఖర్ కమ్ముల రూపొందిస్తున్న సినిమా ‘లవ్ స్టోరీ’. ఈ సినిమా విడుదలకు ముందే పలు రికార్డులను సొంతం చేసుకుంటుంది. ఈ సినిమాలోని ‘సారంగదరియా’ సాంగ్ ఫుల్ పాపులారిటీనీ దక్కించుకుంటూ పలు రికార్డులను కొల్లగొడుతుంది. తాజాగా ఈ పాట యూట్యూబ్‌లో 150 మిలియన్ల వ్యూస్‌, 1.2 మిలియన్ల లైకులను సొంతం చేసుకొని సరికొత్త రికార్డును క్రియేట్‌ చేసింది.

అయితే అతి తక్కువ సమయంలోనే తమ సినిమా పాటకు 150 మిలియన్ల వ్యూస్‌ రావడం పట్ల ‘లవ్‌స్టోరీ’ యూనిట్‌ హర్షం వ్యక్తం చేస్తుంది. ఇదిలా ఉంటే ఈ పాటను మంగ్లీ ఆలపించగా సాయి పల్లవి స్టెప్పులేసింది. అయితే తెలంగాణ జానపదం కావడం, సుద్దాల అశోక్‌ తేజ లిరిక్స్‌కి, పవన్‌ అద్భుత సంగీతం తోడవ్వడంతో ఈ పాట అతి తక్కువ సమయంలోనే లక్షలాది మంది మనసులను కొల్లగొట్టింది.