#SSMB28 టైటిల్‌కు ఆ సినిమాలోని పేరు ఫిక్స్ కాబోతుందా?

Wednesday, May 5th, 2021, 12:46:11 AM IST

సూపర్ స్టార్ మహేష్ బాబు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్‌ కలయికలో గతంలో అతడు, ఖలేజా సినిమాలు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే దాదాపు 11 ఏళ్ల గ్యాప్ తర్వాత వీరిద్దరి కాంబోలో ముచ్చటగా ఇప్పుడు మూడో సినిమా రాబోతుంది. అయితే ఈ సినిమా కోసం అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. హారికా అండ్ హాసిని బ్యానర్‌లో నిర్మిస్తున్న ఈ సినిమాను 2022 సమ్మర్‌లో రిలీజ్ చేయనున్నట్టు ఇటీవలే చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది.

అయితే ఈ సినిమాలో ఈ సినిమాలో మహేష్ బాబు పాత్ర రాజకీయాలకి ముడిపడి ఉందని, బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ కూడా ఈ సినిమాలో నటిస్తున్నాడని ఆయన కోసం కూడా త్రివిక్రమ్ ఓ కీలక పాత్రను రాశాడని అది పక్కా రాజకీయ నాయకుడి పాత్ర అని టాక్ వినిపిస్తుంది. అయితే ప్రస్తుతం ఈ సినిమా కోసం ఒక ఆసక్తికరమైన టైటిల్ పరిశీలనలో ఉందని సమాచారం. మహేష్ బాబు, త్రివిక్రమ్ కలయికలో వచ్చిన మొదటి సినిమా అతడు. ఆ సినిమా మంచి హిట్ అందుకోవడం, ఆ సినిమాలో మహేశ్ బాబు పేరు పార్ధు కావడంతో #SSMB28కి ‘పార్దు’ అనే టైటిట్ పెట్టాలని త్రివిక్రమ్ భావిస్తున్నారని తెలుస్తుంది. అయితే దీనిపై మాత్రం ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.