రెండవ డోస్ వాక్సిన్ తీసుకున్న సూపర్ స్టార్ రజినీకాంత్

Thursday, May 13th, 2021, 06:51:33 PM IST


కరోనా వైరస్ మహమ్మారి తీవ్రత రోజురోజుకీ పెరుగుతోంది. దేశం లో కరోనా వైరస్ మహమ్మారి విలయ తాండవం చేస్తుండటం తో పాజిటివ్ కేసుల సంఖ్య లక్షల్లోకి చేరింది. మరణాలు వేల సంఖ్యలో నమోదు అవుతున్నాయి. అయితే కరోనా వైరస్ కట్టడికి వాక్సిన్ ఒక్కటే మార్గం అని అంతా చెబుతూనే ఉన్నారు. అయితే ఇటీవల కొద్ది రోజుల క్రితం మొదటి డోస్ వేయించుకున్న సూపర్ స్టార్ రజినీకాంత్, నేడు రెండవ డోస్ తీసుకున్నారు. తన నివాసం లో రజినీకాంత్ రెండవ డోస్ వాక్సిన్ తీసుకున్నారు. అయితే అందుకు సంబంధించిన ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయితే రాజకీయ నాయకులు, ప్రముఖులు అంతా కూడా వాక్సిన్ పట్ల భయాలు, అపోహలు వీడాలని చెబుతున్నారు. వాక్సిన్ అందరూ కూడా వేయించుకోవాలి అంటూ సూచిస్తున్నారు.