ఏప్రిల్ 2 వ తేదీన అజయ్ దేవగన్ పాత్రను రివీల్ చేయనున్న ఆర్ఆర్ఆర్ టీమ్!

Tuesday, March 30th, 2021, 12:15:44 PM IST

దర్శక దిగ్గజం రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న రౌద్రం రణం రుధిరం చిత్రం అక్టోబర్ 13 న విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తోంది. అయితే ఈ చిత్రం లో రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో, జూనియర్ ఎన్టీఆర్ కొమురం భీమ్ పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ చిత్రం లో బాలీవుడ్ స్టార్ హీరో అయిన అజయ్ దేవగన్ ఒక కీలక పాత్రలో నటిస్తున్న సంగతి అందరికి తెలిసిందే. అయితే ఈ పాత్ర పై ఇప్పటి వరకూ ఎటువంటి క్లారిటీ రాలేదు. అయితే అందుకు ముగింపు పలికెందుకు చిత్ర యూనిట్ సిద్దం అయింది.

అజయ్ దేవగన్ పాత్ర ను అందుకు సంబంధించిన మోషన్ పోస్టర్ ను ఏప్రిల్ రెండవ తేదీన చిత్ర యూనిట్ విడుదల చేయనుంది. అజయ్ దేవగణ్ ను రాజమౌళి ఈ చిత్రం లో చాలా పవర్ ఫుల్ గా చూపించనున్నారు. అజయ్ దేవగణ్ ను మునుపెన్నడూ చూడని అవతారం లో చూడనున్నట్లు చిత్ర యూనిట్ చెప్పుకొస్తుంది. అయితే అజయ్ దేవగణ్ తో పాటుగా ఈ చిత్రం లో శ్రియ శరణ్ కూడా ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు. అలియా భట్, ఒలివియా మోరిస్ లు కథానాయికలు గా నటిస్తుండగా, సముద్ర ఖని ఒక కీలక పాత్ర పోషించారు. ఈ సినిమా కోసం యావత్ భారత దేశం ఎంతగానో ఎదురు చూస్తోంది.