అల్లు అర్జున్ కి కరోనా వైరస్ పాజిటివ్

Wednesday, April 28th, 2021, 12:07:40 PM IST

కరోనా సెకండ్ వేవ్ తీవ్రత కొనసాగుతూనే ఉంది. అయితే ఏ ఒక్కరినీ కూడా ఈ కరోనా విడిచి పెట్టడం లేదు. తాజాగా ప్రముఖ స్టార్ హీరో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కరోనా వైరస్ భారిన పడ్డారు. ఇదే విషయాన్ని సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. తనకు కోవిడ్ పాజిటివ్ వచ్చింది అని వ్యాఖ్యానించారు. ప్రస్తుతం హోమ్ ఐసోలేషన్ లో ఉన్నా అని చెప్పుకొచ్చారు. అయితే ఇటీవల తనను కలిసిన వారు కరోనా వైరస్ నిర్దారణ పరీక్షలు చేయించుకోవాలి అని కోరారు. అయితే తన మంచి కోరుకొనే వారు, అభిమానులు అంతా కూడా బాధ పడవద్దు అని, తాను క్షేమంగా నే ఉన్నా అంటూ చెప్పుకొచ్చారు. ఇంట్లోనే ఉండండి, జాగ్రత్తగా ఉండండి అంటూ పిలుపు ఇచ్చారు. అయితే అల్లు అర్జున్ కి కరోనా వైరస్ పాజిటివ్ అని తేలడం తో అభిమానులు, ప్రముఖులు స్పందిస్తున్నారు. త్వరగా కోలుకోవాలని ప్రార్ధిస్తున్నారు.