లోకేషన్స్ కి సైతం తన ట్రైనర్ ను తీసుకెళ్తున్న బన్నీ

Friday, March 5th, 2021, 12:47:48 PM IST

తెలుగు సినీ పరిశ్రమ లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న స్టార్ హీరో అల్లు అర్జున్. పాత్రకి అనుగుణంగా అల్లు అర్జున్ ఒదిగిపోతింటారు. అయితే దేశ ముదురు చిత్రం నుండి తన బాడీ లాంగ్వేజ్ ను మారుస్తూ, అభిమానులను అలరిస్తున్నారు. అయితే సుకుమార్ బన్నీ కాంబినేషన్ లో వస్తున్న సినిమా అంటేనే ప్రేక్షకుల్లో ఒక ఆసక్తి నెలకొంటుంది. అల్లు అర్జున్ ను మరింత స్టైలిష్ గా చూపించాలి అంటే ఒక్క సుకుమార్ కే సాధ్యం అని చెప్పాలి. అయితే పుష్ప చిత్రం కోసం అల్లు అర్జున్ రోజుకి రెండు సార్లు వర్కవుట్లు చేస్తున్నారు. లారీ డ్రైవర్ పాత్ర లో అల్లు అర్జున్ ఊర మాస్ లుక్ లో ఉండనున్నారు.

అయితే మేకప్ కోసమే దాదాపు రెండు మూడు గంటల సమయం కేటాయిస్తున్నారు. అయితే తన ట్రైనర్ ను కూడా అల్లు అర్జున్ సెట్స్ లోకి తీసుకెళ్తున్నారు అట. పాత్ర కోసమే ట్రైనర్ ను సైతం వెంటబెట్టుకొని పోతున్నట్లు తెలుస్తోంది. అయితే సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం లో హీరోయిన్ గా రష్మిక మందన్న నటిస్తుంది. ఈ చిత్రానికి సంగీతం దేవిశ్రీప్రసాద్ అందిస్తున్నారు. పాన్ ఇండియన్ మూవీ గా ఈ చిత్రాన్ని ఆగస్టు 13 న విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తుంది.