పవన్ “హరిహర వీరమల్లు” పై ఏఎం రత్నం ఆసక్తికర వ్యాఖ్యలు

Tuesday, April 27th, 2021, 06:24:24 PM IST

పవన్ కళ్యాణ్ వరుస సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉన్నారు. వకీల్ సాబ్ సూపర్ హిట్ విజయం సాధించడం తో అభిమానులు పవన్ చేస్తున్న సినిమా ల పై ఇంకా అంచనాలు పెట్టేసుకున్నారు. అయితే పవన్ కళ్యాణ్ హరీష్ శంకర్ దర్శకత్వం లో ఒక సినిమా, అయ్యప్పన్ కోషియం రీమేక్ లతో పాటుగా, క్రిష్ దర్శకత్వంలో కూడా ఒక సినిమా చేస్తున్నారు. అయితే వీటిలో క్రిష్ దర్శకత్వం లో తెరకెక్కుతున్న హరిహర వీరమల్లు పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రం లో పవన్ కళ్యాణ్ ఒక దొంగ పాత్రలో నటిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ గ్లింప్స్ విడుదల అయి సినిమా పై అంచనాలను మరింతగా పెంచేసింది.

అయితే పవన్ కళ్యాణ్ సినిమా ఫలితం పై ఆధార పడకుండా అభిమానులు ఆదరిస్తారు. అయితే ఈ సినిమా పై ఎన్ని అంచనాలు పెట్టుకున్నా వాటిని అధిగమిస్తుంది ఈ చిత్రం అంటూ చిత్ర నిర్మాత ఏ ఎం రత్నం చెప్పుకొచ్చారు. ఈ చిత్రం పవన్ కళ్యాణ్ కెరీర్ లోనే గుర్తుండి పోయే సినిమా అవుతుంది అని, రాబిన్ హుడ్ తరహ పాత్రలో పవన్ కనిపించబోతున్నారు అని అన్నారు. పవన్ కళ్యాణ్ మొదటి సారి గా పీరియాడిక్ డ్రామా లో నటిస్తుండటం తో సినిమా ఎలా ఉండబోతుంది అనే దాని పై అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.