భారత్ లో మరో మూడు లక్షలకి పైగా కేసులు…2 వేలకు పైగా మరణాలు!

Friday, April 23rd, 2021, 11:07:10 AM IST

india_corona

భారత్ లో కరోనా వైరస్ మహమ్మారి విలయ తాండవం చేస్తోంది. ప్రపంచం లోనే ఎక్కడా లేని విధంగా పాజిటివ్ కేసులు, మరణాలు నమోదు అవుతున్నాయి. అయితే ఈ మహమ్మారి తీవ్రత ఇంకా కొనసాగుతూనే ఉండటం పట్ల అటు కేంద్ర ప్రభుత్వం, ఇటు రాష్ట్ర ప్రభుత్వాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఇప్పటికే ఆక్సిజన్ కొరత సైతం రోగుల ప్రాణాల మీదికి తీసుకు వస్తోంది. అయితే గడిచిన 24 గంటల్లో మరో 17,40,550 మందికి కరోనా వైరస్ నిర్దారణ పరీక్షలు నిర్వహించగా అందులో 3,32,730 మందికి కరోనా వైరస్ పాజిటివ్ అని తేలింది. తాజా గా నమోదు అయిన కరోనా వైరస్ పాజిటివ్ కేసులతో కలిపి మొత్తం భారత్ లో ఇప్పటి వరకూ కరోనా వైరస్ సోకిన వారి సంఖ్య 1,62,63,695 కి చేరింది.

అదే తరహలో కరోనా వైరస్ మృతుల సంఖ్య పెరుగుతూనే ఉంది. గడిచిన 24 గంటల్లో మరో 2,263 మంది కరోనా వైరస్ చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. తాజాగా నమోదు అయిన కరోనా వైరస్ మరణాల తో మొత్తం భారత్ లో ఇప్పటి వరకూ కరోనా వైరస్ సోకి ప్రాణాలను కోల్పోయిన వారి సంఖ్య 1,86,920 కి చేరింది. అయితే నిన్న ఒక్క రోజే 1,93,279 మంది కరోనా వైరస్ భారీ నుండి కోలుకున్నారు. ఇప్పటి వరకూ భారత్ లో కరోనా వైరస్ భారీ నుండి కోలుకున్న వారి సంఖ్య కోటి 36 లక్షలకు పైగా చేరింది. ప్రస్తుతం భారత్ లో 24,28,616 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు యాక్టిివ్ గా ఉన్నాయి.