తెలంగాణలో మరో 6,206 కేసులు…29 మరణాలు

Friday, April 23rd, 2021, 09:30:10 AM IST

తెలంగాణ రాష్ట్రం లో కరోనా వైరస్ మహమ్మారి తీవ్రత కొనసాగుతూనే ఉంది. గడిచిన 24 గంటల్లో మరో 1,05,602 మందికి కరోనా వైరస్ నిర్దారణ పరీక్షలు నిర్వహించగా అందులో 6,206 మందికి కరోనా వైరస్ పాజిటివ్ అని తేలింది. తాజాగా నమోదు అయిన కరోనా వైరస్ మరణాల తో మొత్తం తెలంగాణ రాష్ట్రం లో ఇప్పటి వరకూ కరోనా వైరస్ సోకిన వారి సంఖ్య 3,79,494 కి చేరింది. అయితే ప్రతి రోజూ కూడా 5 వేలకు పైగా కేసులు నమోదు కావడం పట్ల ప్రజలు మరింత ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మళ్ళీ ఆరు వేలకు పైగా కేసులు నమోదు కావడం ప్రజలను మరింత భయాందోళన కి గురి చేస్తోంది.

అదే తరహాలో తెలంగాణ రాష్ట్రం లో కరోనా వైరస్ మృతుల సంఖ్య పెరుగుతూనే ఉంది. గడిచిన 24 గంటల్లో మరో 29 మంది కరోనా వైరస్ చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. తాజాగా నమోదు అయిన కరోనా వైరస్ మరణాల తో మొత్తం తెలంగాణ రాష్ట్రం లో ఇప్పటి వరకూ కరోనా వైరస్ సోకి ప్రాణాలను కోల్పోయిన వారి సంఖ్య 1,928 కి చేరింది. అయితే కరోనా వైరస్ మరణాలు కూడా ఎక్కువగా సంభవించడం ఆందోళన కలిగిస్తోంది. మరొక పక్క మరింత అప్రమత్తం గా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. నిన్న ఒక్క రోజే 3,052 మంది కరోనా వైరస్ భారీ నుండి కోలుకున్నారు. ఇప్పటి వరకూ కరోనా వైరస్ భారీ నుండి కోలుకున్న వారి సంఖ్య 3,24,840 కి చేరింది. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రం లో 52,726 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు యాక్టిివ్ గా ఉన్నాయి.