భారత్ లో మరో 3,68,147 కరోనా కేసులు…3,417 మరణాలు!

Monday, May 3rd, 2021, 11:53:10 AM IST


భారత్ లో కరోనా వైరస్ మహమ్మారి విలయ తాండవం చేస్తోంది. అయితే ఈ మహమ్మారి తీవ్రత దేశం లో కొనసాగుతూనే ఉంది. గడిచిన 24 గంటల్లో మరో 15,04,698 మందికి కరోనా వైరస్ నిర్దారణ పరీక్షలు నిర్వహించగా అందులో 3,68,147 మందికి కరోనా వైరస్ పాజిటివ్ అని తేలింది. తాజాగా నమోదు అయిన కరోనా వైరస్ పాజిటివ్ కేసులతో కలిపి మొత్తం భారత్ లో ఇప్పటి వరకూ కరోనా వైరస్ సోకిన వారి సంఖ్య కోటి 99 లక్షలకు పైగా చేరింది. అయితే ఈ మహమ్మారి తీవ్రత ఇంకా కొనసాగుతూనే ఉండటం పట్ల ప్రజలు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు.

అదే తరహాలో కరోనా వైరస్ మృతుల సంఖ్య పెరుగుతూనే ఉంది. గడిచిన 24 గంటల్లో మరో 3,417 మంది కరోనా వైరస్ చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. తాజాగా నమోదు అయిన కరోనా వైరస్ మరణాల తో మొత్తం భారత్ లో ఇప్పటి వరకూ కరోనా వైరస్ సోకి ప్రాణాలను కోల్పోయిన వారి సంఖ్య 2,18,959 కి చేరింది. నిన్న ఒక్క రోజే 3,00,732 మంది కరోనా వైరస్ భారీ నుండి కోలుకున్నారు. ఇప్పటి వరకూ కరోనా వైరస్ భారీ నుండి కోలుకున్న వారి సంఖ్య భారత్ లో కోటి 62 లక్షలకు పైగా చేరింది. ప్రస్తుతం భారత్ లో 34,13,642 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు యాక్టిివ్ గా ఉన్నాయి.