తెలంగాణలో మరో 6,361 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు

Wednesday, May 5th, 2021, 09:51:22 AM IST

తెలంగాణ లో కరోనా వైరస్ మహమ్మారి తీవ్రత కొనసాగుతూనే ఉంది. అయితే గడిచిన 24 గంటల్లో మరో 77,435 మందికి కరోనా వైరస్ నిర్దారణ పరీక్షలు నిర్వహించగా అందులో 6,361 మందికి కరోనా వైరస్ పాజిటివ్ అని తేలింది. తాజాగా నమోదు అయిన కరోనా వైరస్ పాజిటివ్ కేసులతో కలిపి మొత్తం తెలంగాణ రాష్ట్రం లో ఇప్పటి వరకూ కరోనా వైరస్ సోకిన వారి సంఖ్య 4,69,722 కి చేరింది. అయితే ఈ మహమ్మారి తీవ్రత ఇంకా కొనసాగుతూనే ఉండటం పట్ల రాష్ట్ర ప్రజలు తీవ్ర భయాందోళన వ్యక్తం చేస్తున్నారు.

అదే తరహాలో తెలంగాణ రాష్ట్రం లో కరోనా వైరస్ మృతుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. గడిచిన 24 గంటల్లో మరో 51 మంది కరోనా వైరస్ చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. తాజాగా నమోదు అయిన కరోనా వైరస్ మరణాల తో మొత్తం తెలంగాణ రాష్ట్రం లో ఇప్పటి వరకూ కరోనా వైరస్ సోకి ప్రాణాలను కోల్పోయిన వారి సంఖ్య 2,527 కి చేరింది. నిన్న ఒక్క రోజే 8,126 మంది కరోనా వైరస్ భారీ నుండి కోలుకున్నారు. పాజిటివ్ కేసుల కంటే రికవరీ ల సంఖ్య ఎక్కువగా ఉండటం కాస్త ఊరట కలిగించే అంశం అని చెప్పాలి. మొత్తం తెలంగాణ రాష్ట్రం లో ఇప్పటి వరకూ కరోనా వైరస్ భారీ నుండి కోలుకున్న వారి సంఖ్య 3,89,491 కి చేరింది. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రం లో 77,704 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు యాక్టిివ్ గా ఉన్నాయి.