తెలంగాణ కాంగ్రెస్‌కు వరుస షాక్‌లు తగులుతున్నాయి. ఇప్పటికే ముఖ్య నేతలు ఒక్కొకరుగా పార్టీకి గుడ్‌బై చెబుతూ వస్తున్నారు. అయితే తాజాగా కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి హర్షవర్ధన్‌రెడ్డి ఆ పార్టీకి రాజీనామా చేశారు. అంతేకాదు హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్‌నగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసేందుకు బరిలోకి దిగారు.
అయితే హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్‌నగర్ ఎమ్మెల్సీ స్థానానికి పోటీ చేయాలని హర్షవర్ధన్‌రెడ్డి భావించారు. అయితే అధిష్టానం ఆ స్థానాన్ని సీనియర్ నేత చిన్నారెడ్డికి కట్టబెట్టింది. దీంతో హైదరాబాద్ స్థానంపై ఆశలు పెట్టుకున్న హర్షవర్ధన్‌రెడ్డి పార్టీకి రాజీనామా చేసి రెబెల్‌గా బరిలోకి దిగబోతున్నారు. అయితే నామినేషన్ ఉపసంహరించుకోవాలని పలువురు నేతలు హర్షవర్ధన్‌ను బుజ్జగించే ప్రయత్నంలో ఉన్నారు.