ఏపీ మంత్రి గౌతమ్ రెడ్డి కి సోకిన కరోనా!

Friday, April 23rd, 2021, 02:36:31 PM IST

తెలుగు రాష్ట్రాల్లో కరోనా వైరస్ మహమ్మారి తీవ్రత కొనసాగుతూనే ఉంది. అయితే తాజాగా ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి గౌతమ్ రెడ్డి కరోనా వైరస్ భారిన పడ్డారు. తాజాగా కరోనా వైరస్ నిర్దారణ పరీక్షలు చేయించుకోగా అందులో కరోనా వైరస్ పాజిటివ్ అని తేలింది. అయితే ఇప్పుడు మంత్రి గౌతమ్ రెడ్డి ప్రస్తుతం హైదరాబాద్ లోని తన నివాసం లో హోమ్ ఐసోలేషన్ లో ఉన్నారు. అయితే మంత్రికి కరోనా వైరస్ పాజిటివ్ అని తేలడం తో నైపుణ్య అభివృద్ధి శిక్షణ పై మైక్రోసాఫ్ట్ సంస్థ తో జరగాల్సిన కార్యక్రమం నేడు వాయిదా పడింది. అయితే తనను ఇటీవల కలిసిన వారు, సన్నిహితంగా మెలిగిన వారు కరోనా వైరస్ నిర్దారణ పరీక్షలు చేయించుకోవాలి అని వ్యాఖ్యానించారు.