ప్రశ్నిస్తే జగన్ రెడ్డి సర్కారు దేశద్రోహం కేసులు పెడుతోంది – చంద్రబాబు

Tuesday, May 18th, 2021, 04:15:57 PM IST


ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పై తెలుగు దేశం పార్టీ అధినేత, మాజి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఘాటు వ్యాఖ్యలు చేశారు. నలభై ఏళ్ల రాజకీయ జీవితంలో ఏనాడూ బూతులు మాట్లాడలేదు అని చంద్రబాబు నాయుడు చెప్పుకొచ్చారు. అయితే ప్రతి పక్ష పార్టీ నేతగా జగన్ మోహన్ రెడ్డి ఉన్నప్పుడు తనను కాల్చేయాలి అన్నాడు అని, నడిరోడ్డున ఉరి తీయాలని అన్నాడు అని, బంగాళాఖాతం లో కూడా కలపాలి అని అన్నాడు అంటూ చంద్రబాబు నాయుడు అన్నారు. అయితే జగన్ మోహన్ రెడ్డి వ్యవహరించిన తీరు పట్ల ఆనాడు దేశ ద్రోహం కేసులు పెట్టలేదు అని వ్యాఖ్యానించారు. అయితే ఈరోజు ప్రభుత్వం వైఫల్యాలను ప్రశ్నిస్తూ ఉంటే జగన్ రెడ్డి సర్కారు దేశద్రోహం కేసులు పెడుతోంది అంటూ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.