కుట్రలో భాగంగానే నరేంద్రను అక్రమంగా అరెస్ట్ చేశారు – చంద్రబాబు

Friday, April 23rd, 2021, 11:56:49 AM IST

ధూళిపాళ్ల నరేంద్ర ను అరెస్ట్ చేయడం పట్ల తెలుగు దేశం పార్టీ నేతలు, కార్యకర్తలు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు తెలుగు దేశం పార్టీ అధినేత, మాజి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ అరెస్ట్ అంశం పై స్పందిస్తూ అధికార పార్టీ వైసీపీ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే సంగం డెయిరీ ను దెబ్బ తీసి అమూల్ కి కట్టబెట్టే కుట్రలో భాగంగానే ధూళిపాళ్ల నరేంద్ర ను అక్రమం గా అరెస్ట్ చేశారు అంటూ చంద్రబాబు నాయుడు అన్నారు. అయితే నరేంద్ర అరెస్ట్ ను బాబు ఖండించారు. అయితే స్థానిక రైతులు భాగస్వామ్యం గా ఉన్నటువంటి సంగం డెయిరీ ను నిర్వీర్యం చేసి, పొరుగు రాష్ట్రానికి చెందిన అమూల్ తో లోపాయి కారి ఒప్పందాలు చేసుకున్నారు అంటూ చెప్పుకొచ్చారు. ఆ తరహాలో ఇక్కడి సంస్థలను దెబ్బ తీస్తున్నారు అంటూ సంచలన ఆరోపణలు చేశారు. అయితే వైసీపీ రెండేళ్ల పాలన లో అభివృద్ది లేకపోయినా అరెస్టులు ఉన్నాయి అంటూ చెప్పుకొచ్చారు. అంతేకాక తమ పార్టీకి చెందిన అచ్చెన్నాయుడు, కొల్లు రవీంద్ర, దేవినేని ఉమా ల పై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారు అంటూ చెప్పుకొచ్చారు.

అయితే ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో కరోనా వైరస్ మహమ్మారి తీవ్రత కొనసాగుతూనే ఉంది. తీవ్రత పెరిగి పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి, మరణాలు సైతం పెరుగుతూనే ఉన్నాయి. అయితే కరోనా వైరస్ నియంత్రణలో రాష్ట్రం విఫలం అవ్వడం తో ప్రజలను పక్కదోవ పట్టించేందుకు ఈ కక్ష సాధింపు చర్యలు అంటూ చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. అయితే ప్రశ్నించే ప్రతి ఒక్కరినీ అరెస్ట్ చేసుకుంటూ పోతే ఎవరూ మిగలరు అనే విషయాన్ని సీఎం జగన్ గుర్తించాలి అని వ్యాఖ్యానించారు. అయితే నరేంద్ర ను తక్షణమే విడుదల చేయాలని చంద్రబాబు నాయుడు డిమాండ్ చేశారు.