అమరావతి కోసం విజయవాడ ప్రజలు ఇంటికొకరు రావాలి – చంద్రబాబు

Sunday, March 7th, 2021, 03:00:12 PM IST

తెలుగు దేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మునిసిపల్ ఎన్నికల ప్రచారం లో భాగం గా విజయవాడ లో ప్రచారం నిర్వహించారు. అయితే విజయవాడ 41 వ డివిజన్ లో పర్యటించిన చంద్రబాబు పలు కీలక వ్యాఖ్యలు చేశారు. అమరావతి ఆంధ్రుల హక్కు అని, దీనిపై ప్రతి ఒక్కరూ పోరాడాలి అంటూ పిలుపు ఇచ్చారు అమరావతి కోసం విజయవాడ ప్రజలు ఇంటికోకరు రావాలి అంటూ చెప్పుకొచ్చారు. అమరావతి కోసం పక్కా ప్రణాళిక తో ముందుకు వెళ్ళామని, ఇందుకోసం విజయవాడ ప్రజలు గట్టిగా నిలబడాలి అంటూ చెప్పుకొచ్చారు. పట్టిసీమ నీటి లబ్ది దారులు ఆలోచించాలి అని వ్యాఖ్యానించారు. విజయవాడ మేయర్ గా కచ్చితంగా తెలుగు దేశం పార్టీ అభ్యర్థి ఉండాలి అని, లేదంటే ఇక్కడి ప్రజలకు తలెత్తి తిరగలేరు అంటూ చంద్రబాబు నాయుడు అన్నారు.

అయితే ఇక్కడి మంత్రి కి దుర్గమ్మ పైన భయం, భక్తి లేవు అని, విజయవాడ లో తెలుగు దేశం పార్టీ గెలవకుండా మీరు తలెత్తుకు తిరగలేరు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రాన్ని నేరస్తులు, గుండాల అడ్డాగా మార్చారు అంటూ సంచలన ఆరోపణలు చేశారు. అంతేకాక ఈ ప్రచారం లో అన్నా కాంటీన్ ల ప్రస్తావన తీసుకు వచ్చారు. పేదవాడి కడుపు నింపే అన్నా కాంటీన్ లను తీసేశారు అంటూ చెప్పుకొచ్చారు. అయితే వైసీపీ నేతలు మాత్రం మున్సిపల్ మరియు కార్పొరేషన్ ఎన్నికల్లో భారీ విజయం సాధిస్తాం అంటూ చెప్పుకొస్తున్నారు.