జనసేన-బీజేపీ అభ్యర్థులకు ప్రచారం చేస్తా.. చింతమనేని సంచలన వ్యాఖ్యలు..!

Thursday, March 4th, 2021, 02:08:59 AM IST


టీడీపీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మున్సిపల్ ఎన్నికల తరుణంలో పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు మున్సిపల్ కార్పొరేషన్‌లో జరిగిన పరిణామాలపై ఆయన స్పందిస్తూ వైసీపీపై నిప్పులు చెరిగారు. అయితే టీడీపీ తరపున నామినేషన్లు వేసి, వాటిని విత్‌ డ్రా చేసుకున్న అభ్యర్థులపై చింతమనేని ఆగ్రహం వ్యక్తం చేశారు.

అయితే టీడీపీ అభ్యర్థులు విత్‌డ్రా చేసుకున్న డివిజన్లలో పోటీలో ఉన్న బీజేపీ, జనసేన పార్టీలకు చెందిన అభ్యర్థులుంటే వారి తరఫున ప్రచారం చేస్తానని చింతమనేని ప్రకటించారు. పార్టీని అమ్ముకున్నవారికి భవిష్యత్ ఉండదని, పార్టీని నమ్ముకున్నవారికి తాను అండగా ఉంటానని చెప్పుకొచ్చారు. అయితే చింతమనేని చేసిన ఈ వ్యాఖ్యలతో ఏలూరు కార్పొరేషన్‌ ఎన్నికల్లో ఒక్కసారిగా హీటు పెరిగిపోయింది.