బ్యాంకుల ద్వారా నేరుగా సున్నా వడ్డీలకే రుణాలు అందిస్తున్నాం – వైఎస్ జగన్

Friday, April 23rd, 2021, 12:44:14 PM IST

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం పాలనా విధానం లో దూసుకు పోతుంది. నేడు మరొక మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని సీఎం జగన్ మోహన్ రెడ్డి అన్నారు. అయితే సున్నా వడ్డీ నగదు పథకం కింద నేడు 1.02 కోట్ల మందికి పైగా పొదుపు సంఘాల అక్కా చెల్లెమ్మలకు లబ్ది చేకూరుతుంది అని వ్యాఖ్యానించారు. మహిళలకు అన్ని విధాలుగా అండగా నిలబడుతూ వస్తున్నాం అని, మహిళా సాధకారతను ఆచరణ లోకి తీసుకు రాగలిగాం అని చెప్పుకొచ్చారు. బ్యాంకుల ద్వారా నేరుగా సున్నా వడ్డీ లకే రుణాలు అందిస్తున్నాం అని అన్నారు. అయితే డ్వాక్రా సంఘాల అప్పు పై ఈ ఏడాది 1,108 కోట్ల రూపాయలను చెల్లిస్తున్నాం అని అన్నారు. ఆన్లైన్ ద్వారా బ్యాంకు ఖాతాల్లో సీఎం వైఎస్ జగన్ జమ చేశారు. అయితే మహిళల అభివృద్దే లక్ష్యంగా ప్రభుత్వం పని చేస్తోంది అని, మహిళల ఆర్థిక స్వావలంబన కోసం కృషి చేస్తున్నాం అని అన్నారు.

అయితే మహిళా సాధికారత మా నినాదం కాదు, అది మా విధానం అంటూ చెప్పుకొచ్చారు. అయితే గత టీడీపీ ప్రభుత్వం రుణాల పేరుతో మహిళలను మోసం చేసింది అంటూ చెప్పుకొచ్చారు. అంతేకాక దేశ చరిత్రలో ఎక్కడా లేని విధంగా మహిళలకు 50 శాతం నామినేటెడ్ పోస్టులు ఇచ్చేలా చట్టం చేశామని తెలిపారు. అంతేకాక రాష్ట్రంలో శాంతి భద్రత లకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నాం అని వ్యాఖ్యానించారు.