కేంద్ర ఎన్నికల సంఘం పై కాంగ్రెస్ సీనియర్ నేత సంచలన వ్యాఖ్యలు

Tuesday, May 4th, 2021, 08:47:33 AM IST

కేంద్ర ఎన్నికల సంఘం పై కాంగ్రెస్ పార్టీ కి చెందిన సీనియర్ నేత ఆనంద్ శర్మ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఓటర్ల విశ్వాసం ను కోల్పోయిన ఎన్నికల సంఘాన్ని రద్దు చేయాలి అంటూ ఆనంద్ శర్మ డిమాండ్ చేశారు. అయితే సంఘం సభ్యుల పై విచారణ జరిపి, చర్యలు తీసుకోవాలని అన్నారు. ఎన్నికల సంఘం సభ్యులు, కేంద్ర ఎన్నికల కమిషనర్ ఎంపిక నియామకానికి ప్రత్యేక విధానం రూపొందించేందుకు సుప్రీం కోర్టు ప్రత్యేక ధర్మాసనాన్ని ఏర్పాటు చేయాలి అంటూ చెప్పుకొచ్చారు. అంతేకాక రాజ్యాంగం ప్రకారం ఎన్నికలు నిష్పాక్షికంగా జరిపేందుకు అవసరమైన మార్గదర్శకాలను ఈ ధర్మాసనం రూపొందించాలి అంటూ చెప్పుకొచ్చారు. అయితే ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాల అనంతరం కేంద్ర మాజి మంత్రి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సర్వత్రా హాట్ టాపిక్ గా మారింది.

అయితే ఎన్నికల సంఘం వ్యవహార శైలి పై అనేక అనుమానాలు ఉన్నాయి అంటూ చెప్పుకొచ్చారు. అయితే ఎన్నికలని స్వేచ్ఛగా, నిష్పక్షికంగా జరపాలన్న రాజ్యాంగం లోని ఆర్టికల్ 324 పేర్కొన్న ఆదేశాలను ఎన్నికల కమిషన్ ఉల్లంఘించింది అంటూ సంచలన ఆరోపణలు చేశారు. అయితే బెంగాల్ లో ఈసీ చర్యలు పూర్తిగా ఏకపక్షంగా ఉన్నాయి అని అన్నారు. ఇలాంటి తీరు గర్హనీయం అని, బీజేపీ కు అనుకూలంగా వ్యవహరించింది అనేందుకు అనేక ఆధారాలు ఉన్నాయి అని తెలిపారు.