అమిత్ షా, కేసీఆర్ సహకారం లేకుండా రఘురామ ను అరెస్ట్ చేసే అవకాశం లేదు – నారాయణ

Tuesday, May 18th, 2021, 10:28:04 AM IST


సంచలనం సృష్టిస్తున్న ఎంపీ రఘురామ కృష్ణంరాజు అరెస్ట్ పై సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ సహకారం లేకుండా నర్సాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు ను అరెస్ట్ చేసే అవకాశం లేదని స్పష్టం చేశారు. అయితే ఎంపీ రఘురామ కృష్ణంరాజు చేసిన వ్యాఖ్యలను తాను సమర్ధించడం లేదు అని వ్యాఖ్యానించారు. కాకపోతే చట్ట ప్రకారం, కోర్టు ఆదేశాలు అమలు చేయకుండా ఇష్టానుసారం గా వ్యవహరించడాన్ని వ్యతిరేకిస్తున్నట్లు చెప్పుకొచ్చారు. అయితే ముఖ్యమంత్రి కూడా ఒక వాక్సిన్ కంపనీ విషయం లో యజమాని కులం గురించి ప్రస్తావించారు అని అన్నారు.

అయితే పై స్థాయి బీజేపీ నేతలు అరెస్టుకు అనుమతి ఇచ్చి, రాష్ట్ర స్థాయి లో బీజేపీ నేతలు అరెస్ట్ ను ఖండించడం వింతగా ఉంది అంటూ నారాయణ చెప్పుకొచ్చారు. అయితే ఈ నేపథ్యం లో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ పై సైతం సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా ఈటెల రాజేందర్ పై కక్ష సాధింపు చర్యలకు దిగుతున్నారు అని సంచలన ఆరోపణలు చేశారు. అయితే ప్రతి పక్షాలు లేకుండా చూడడం సాధ్యం కాదు అని, ఒకవేళ ఇలాంటి పరిస్థితి వస్తే ప్రజలే ప్రతి పక్ష పాత్ర పోషించాల్సి ఉంటుంది అంటూ చెప్పుకొచ్చారు. అయితే నారాయణ చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్నాయి. మరి దీని పై అధికార పార్టీ కి చెందిన నేతలు ఎలా స్పందిస్తారో చూడాలి.