పవన్ కళ్యాణ్ గారితో పని చేయడం ఎంతో సంతోషంగా ఉంది – వేణు శ్రీరామ్

Monday, March 22nd, 2021, 12:03:32 PM IST

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న తాజా చిత్రం వకీల్ సాబ్. ఈ చిత్రం ఏప్రిల్ 9 వ తేదీన ప్రేక్షకుల ముందుకి రానుంది. అయితే ఈ చిత్రం నుండి విడుదల అయిన మూడు పాటలకి కూడా అభిమానుల నుండి, ప్రేక్షకుల నుండి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. మగువా మగువా, సత్యమేవ జయతే, కంటిపాప సాంగ్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అయితే వకీల్ సాబ్ చిత్రానికి సంబంధించి మ్యూజికల్ ఫెస్ట్ ను హైదరాబాద్ లో నిర్వహించారు. అయితే ఈ కార్యక్రమం లో సంగీత దర్శకుడు థమన్ మరియు డైరెక్టర్ వేణు శ్రీరామ్ పాల్గొన్నారు. ఈ మేరకు వారు సినిమా గురించి పలు కీలక వ్యాఖ్యలు చేశారు.

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారితో పని చేయడం ఎంతో సంతోషంగా ఉందని డైరెక్టర్ వేణు శ్రీరామ్ అన్నారు. వకీల్ సాబ్ సినిమా మీ అందరి అంచనాలు అందుకునేలా ఉంటుంది అని తెలిపారు. సినిమా చేస్తున్నప్పుడు ఎంతో ఎంజాయ్ చేశామని చెప్పారు. అయితే రేపు థియేటర్ల లో కూడా అదే అనుభూతి కలుగుతుంది అని నమ్ముతున్నాం అంటూ చెప్పుకొచ్చారు అయితే సినిమా ప్రారంభం నుండి పూర్తి అయ్యే వరకు పవన్ ఇచ్చిన సపోర్ట్ మర్చిపోలేను అని వ్యాఖ్యానించారు. అంతేకాక వకీల్ సాబ్ చిత్రానికి మ్యూజిక్ ఇచ్చిన సంగీత దర్శకుడు థమన్ కి థాంక్స్ అని చెప్పుకొచ్చారు. అలానే పాటలకు అద్భుతమైన లిరిక్స్ ఇచ్చిన రామజోగయ్య శాస్త్రి గారికి స్పెషల్ థాంక్స్ తెలిపారు. అయితే ఈ చిత్రానికి వకీల్ సాబ్ టైటిల్ పవన్ కళ్యాణ్ ఇమేజ్ దృష్టి లో ఉంచి పెట్టినట్లు చెప్పుకొచ్చారు.

అయితే సంగీత దర్శకుడు థమన్ సైతం పవన్ కళ్యాణ్ పై ప్రశంశల వర్షం కురిపించారు. పవన్ కళ్యాణ్ గారు సినిమా కి చేయడం తన డ్రీమ్ అని, వకీల్ సాబ్ తో అది నెరవేరింది అని, పవన్ కళ్యాణ్ కమ్ బ్యాక్ సినిమా కి సంగీతం అందించడం ఎంతో సంతోషంగా ఉందని అన్నారు. పాటలు అన్నీ సూపర్ గా ఉన్నాయి అని, రీ రికార్డింగ్ సమయం లో సినిమా చూస్తున్నప్పుడు పేపర్స్ చింపేయాలి అనేంత మాస్ కనిపించింది అని అన్నారు.రేపు థియేటర్లలో మీరంతా ఎంజాయ్ చేస్తారు అని అన్నారు.