పిలిపించి అడిగితే నేనే రాజీనామా చేసేవాడిని – ఈటెల రాజేందర్

Tuesday, May 4th, 2021, 04:44:27 PM IST


తెలంగాణ రాష్ట్ర మంత్రులు గంగుల కమలాకర్, కొప్పుల ఈశ్వర్ చేసిన వ్యాఖ్యల కి ఈటెల రాజేందర్ స్పందించారు. హుజూరబాద్ లోని తన నివాసం లో నిర్వహించిన మీడియా సమావేశం లో మాజి మంత్రి ఈటెల రాజేందర్ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. అయితే సీఎం కేసీఆర్ కి ఆరోగ్యం బాగోలేక ఉన్న సమయం లో కలవడానికి ప్రగతి భవన్ వెళ్లేందుకు సిద్దమవ్వగా మంత్రులు అనుమతించలేదు అని ఈటెల రాజేందర్ తెలిపారు. అయితే 2014 వరకే సీఎం కేసీఆర్ ధర్మాన్ని, ప్రజలను నమ్ముకున్నారు అని వ్యాఖ్యానించారు. తెలంగాణ గాంధీ గా పేరు గాంచిన గొప్ప వ్యక్తి నేడు కక్ష పూరితంగా వ్యవహరిస్తున్నారు అంటూ సంచలన ఆరోపణలు చేశారు.

అయితే ఎవరివో తప్పుడు సలహాలు, తప్పుడు నివేదికల వలన తన పై కక్ష సాధిస్తున్నారు అని అన్నారు. అయితే నా వ్యవహారం నచ్చకపోతే పిలిపించి అడిగితే నేనే రాజీనామా చేసే వాడిని అంటూ అవేదన వ్యక్తం చేశారు. అయితే ఇప్పుడు తనను విమర్శిస్తున్న వారంతా కూడా తన సహచరులే అంటూ చెప్పుకొచ్చారు. అయితే తాను ముఖ్యమంత్రి కావాలని అనుకోలేదు అని, కేసీఆర్ తర్వాత తన కుమారుడు కేటీఆర్ సీఎం కావాలని అన్నాను అంటూ మాజి మంత్రి ఈటెల రాజేందర్ అన్నారు. అయితే ఈటెల రాజేందర్ చేసిన వ్యాఖ్యలు సర్వత్రా హాట్ టాపిక్ గా మారాయి.