గతంతో పోల్చితే సెకండ్ వేవ్ డేంజర్ గా ఉంది – హెల్త్ డైరెక్టర్ శ్రీనివాస రావు

Wednesday, April 7th, 2021, 06:44:07 PM IST

తెలంగాణ రాష్ట్రం లో కరోనా వైరస్ మహమ్మారి తీవ్రత కొనసాగుతూనే ఉంది. ప్రతి రోజూ కూడా వెయ్యి కి పైగా కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదు అవుతున్నాయి. నిన్న ఒక్క రోజే రెండు వేలకు చేరువలో పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. అయితే మరణాల సంఖ్య సైతం పెరుగుతూనే ఉంది. ఈ మేరకు తెలంగాణ రాష్ట్రం లో ప్రభుత్వం పలు కీలక చర్యలు తీసుకుంటోంది. తెలంగాణ రాష్ట్రం లో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు పెరుగుతున్న నేపథ్యం లో మూడో ప్రమాద హెచ్చరిక ను జారీ చేయడం జరిగింది. అయితే పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాస రావు ఈ మేరకు పలు కీలక వ్యాఖ్యలు చేశారు. గతంతో పోల్చితే సెకండ్ వేవ్ డేంజర్ గా ఉందని వ్యాఖ్యానించారు. వచ్చే నాలుగు వారాలు కీలకం అని చెప్పుకొచ్చారు. బెడ్స్ దొరక్క పోయే ప్రమాదం ఉందని తెలిపారు. కరోనా వైరస్ పాజిటివ్ కేసులు విపరీతంగా పెరుగుతున్న నేపథ్యం లో ప్రజలు అంతా కూడా అప్రమత్తం గా ఉండాలని తెలిపారు.