బిగ్ న్యూస్: ఏపీ లో యధావిధిగా ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు

Wednesday, April 7th, 2021, 04:06:52 PM IST

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలని యధావిధిగా నిర్వహించాలని హైకోర్ట్ డివిజన్ బెంచ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే ఎన్నికల పై స్టే విధిస్తూ హై కోర్ట్ సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును డివిజన్ బెంచ్ కొట్టి వేసింది. యధావిధిగా ఎన్నికలు నిర్వహించాలి అంటూ తీర్పు ఇచ్చింది. అయితే ఈ తీర్పు నేపథ్యం లో రేపే ఈ ఎన్నికల నిర్వహణ జరగనుంది. అయితే ఇంకా ఇందుకు సంబంధించిన ఆదేశాలను వచ్చే వరకు కూడా కౌంటింగ్ నిలిపి వేయాల్సిందిగా ఆదేశాలను జారీ చేసింది. అయితే పరిషత్ ఎన్నికల స్టే పై ప్రభుత్వం తరపున శ్రీరం వాదనలు వినిపించారు.

అయితే ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర హైకోర్టు సింగిల్ బెంచ్ ఇచ్చిన ఉత్తర్వులను రద్దు చేయాలి అంటూ ఏజి కోర్టు ను కోరడం జరిగింది. అయితే పిటిషన్ వేసిన వర్ల రామయ్యకి ఎన్నికల తో సంబందం లేదు అని వ్యాఖ్యానించారు.అయితే 28 రోజుల కోడ్ నిబంధన ఎన్నికల కి వర్తింప చేయాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. అయితే ఇరుపక్ష వాదనలు విన్న అనంతరం హైకోర్ట్ డివిజన్ బెంచ్ తీర్పు వెల్లడించింది. అయితే రేపు యధావిధిగా రాష్ట్రం లో ఎన్నికలు జరగనున్నాయి. మరి ఈ తీర్పు పై ప్రతి పక్ష పార్టీ నేతలు ఎలా స్పందిస్తారో చూడాలి.