ఏపీలో మున్సిపల్ ఎన్నికల జోరు మరింత పెరిగింది. ఇప్పటికే అధికార, విపక్ష పార్టీలు గెలుపే లక్ష్యంగా ప్రచారాన్ని హోరెత్తిస్తున్నాయి. అయితే ఎన్నికల ప్రచారంలో భాగంగా నేడు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కర్నూల్‌కు వెళ్ళారు. కర్నూల్లో టీడీపీ అభ్యర్థుల తరుపున ప్రచారం చేసి వారిలోనూ, అటు కార్యకర్తల్లోనూ జోష్ నింపాలని ప్రయత్నించిన చంద్రబాబుకు చేదు అనుభవం ఎదురయ్యింది.
అయితే కర్నూలులో హైకోర్టు ఏర్పాటుకు మద్దతివ్వాలని డిమాండ్ చేస్తూ లాయర్లు చంద్రబాబు రోడ్ షోను అడ్డుకున్నారు. అనంతరం పోలీసులు కలగచేసుకుని రోడ్‌షో జరిగేలా చూశారు. ఇదిలా ఉంటే మూడు రాజధానులలో భాగంగా కర్నూల్‌ను న్యాయ రాజధాని చేయాలని, కర్నూల్లో హైకోర్ట్ పెట్టాలని ప్రభుత్వం చూస్తుంటే దానికి చంద్రబాబు అడ్డుపడుతున్నారని వైసీపీ నేతలు ఆరోపణలు చేస్తున్న సంగతి తెలిసిందే. మరి ఈ ప్రచారాన్ని అధిగమించి టీడీపీ ఎలా బయటపడుతుందో చూడాలి మరీ.