కరోనా రోగులతో నిండిపోయిన గాంధీ ఆసుపత్రి

Friday, April 23rd, 2021, 01:55:36 PM IST

తెలంగాణ రాష్ట్రం లో కరోనా వైరస్ మహమ్మారి తీవ్రత రోజురోజుకీ పెరిగిపోతోంది. చికిత్స కోసం ప్రజలు ప్రభుత్వ ఆసుపత్రులకు పరుగులు పెడుతున్నారు. అయితే మరొకసారి కరోనా ఆసుపత్రి గా మారిన గాంధీ ఆసుపత్రి కరోనా రోగులతో నిండిపోయింది. గాంధీ ఆసుపత్రి కి సీరియస్ కేసులు ఎక్కువగా వస్తుండటం తో ప్రజలు మరింత ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గాంధీ లో సాధారణ బెడ్స్ నుండి ఐసీయూ, వెంటిలేటర్ బెడ్స్ కూడా పూర్తిగా నిండిపోయాయి. అయితే చివరి స్టేజ్ లో వచ్చినటువంటి రోగులు తమ ప్రాణాలను కోల్పోతున్నారు. అయితే కరోనా వైరస్ చికిత్స కి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలా చర్యలు తీసుకుంటుంది. ఆక్సిజన్ కొరత లేకుండా అన్ని ఏర్పాట్లు చేస్తోంది. అయితే మరొక పక్క కరోనా వైరస్ వాక్సినేషన్ ప్రక్రియ మరింత వేగవంతం గా జరుగుతోంది.