మహేశ్ ఖాతాలో మరో “మైండ్ బ్లాక్” రికార్డ్..!

Saturday, April 24th, 2021, 10:00:20 PM IST

సూపర్ స్టార్ మహేశ్ బాబు ఖాతాలో మరో రికార్డ్ నమోదైంది. గత ఏడాది మహేశ్, రష్మిక మందన్న జంటగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన సరిలేరు నీకెవ్వరు సినిమా మంచి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టి అదిరిపోయే వసూళ్లను తెచ్చుకున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఈ సినిమాలోని మైండ్ బ్లాక్ సాంగ్ ఓ కొత్త రికార్డ్ సృష్టించింది. ఈ పాట యూట్యూబ్‌లో 100 మిలియన్ వ్యూస్ మార్క్‌ను క్రాస్ చేసి మహేష్ కెరీర్‌లో మరో 100 మిలియన్ వీడియోగా నిలిచింది. దేవి శ్రీ ప్ర‌సాద్ సంగీత సార‌థ్యంలో రూపొందిన ఈ పాట ఆ సినిమాలో బాగా పాపులర్ అయ్యింది. ఇదిలా ఉంటే ప్రస్తుతం మహేశ్ బాబు ప‌ర‌శురాం ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న సర్కార్ వారి పాట సినిమాలో బిజీగా ఉన్నాడు. వచ్చే సంక్రాంతికి ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.