కాన్వాయ్‌ని సరెండర్ చేసిన ఈటల రాజేందర్..!

Monday, May 3rd, 2021, 05:29:32 PM IST


మాజీ మంత్రి ఈటల రాజేందర్ భూ కబ్జా వ్యవహారం ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాఫిక్‌గా మారింది. ఆయనపై వచ్చిన కబ్జా ఆరోపణలు వాస్తవమే అని తేలడంతో సీఎం కేసీఆర్ ఈటలను మంత్రి పదవి నుంచి భర్తరప్ చేశారు. దీంతో నేడు మీడియాతో మాట్లాడిన ఈటల తన రాజకీయ భవిష్యత్తుపై నియోజకవర్గ ప్రజలతో చర్చించి తదుపరి కార్యాచరణను ప్రకటిస్తానని తెలిపాడు.

అయితే తాజాగా ఈటల తన బుల్లెట్‌ ప్రూఫ్‌ వాహనంతో పాటు కాన్వాయ్‌ని కూడా ప్రభుత్వానికి సరెండర్‌ చేశారు. ఎమ్మెల్యేగా ఇచ్చే గన్‌మెన్లను మినహా మిగతా సెక్యూరిటీ సిబ్బందిని మొత్తం ఆయన వెనక్కి పంపించేశారు. శామీర్‌పేటలోని తన నివాసం నుంచి ఆయన హుజూరాబాద్‌ బయల్దేరారు. అయ్తే అక్కడ కార్యకర్తలు, అనుచరులతో సమావేశమై తదుపరి కార్యాచరణపై చర్చించే అవకాశం ఉంది.