బీజేపీ నేతలు నోరెందుకు మెదపడం లేదు…మంత్రి కేటీఆర్ సూటి ప్రశ్న!

Sunday, March 7th, 2021, 05:30:46 PM IST

తెలంగాణ రాష్ట్రం లో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు ప్రతిష్టాత్మకం కానున్నాయి. బలమైన బీజేపీ అభ్యర్థి పై తెరాస పీవీ వాణీ దేవి అభ్యర్ధి ను ఖరారు చేసిన సంగతి తెలిసిందే. అయితే ప్రశ్నించే గొంతుక పేరుతో ప్రచారం చేస్తున్న బీజేపీ అభ్యర్ధి రామచంద్రరావు గత ఆరేళ్ల లో ఏం చేశారు అంటూ సూటిగా ప్రశ్నించారు. అయితే హైదరాబాద్ లో దోమల గూడా లో పీవీ వాణీ ఏర్పాటు చేసిన సమన్వయ సమ్మేళనం లో కేటీఆర్ పాల్గొన్నారు. ఈ మేరకు పలు కీలక వ్యాఖ్యలు చేశారు.

తెలంగాణ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం అడుగడుగునా అన్యాయం చేస్తున్నా, రాష్ట్ర బీజేపీ నేతలు నోరెందుకు మెదపడం లేదు అంటూ సూటిగా ప్రశ్నించారు. లక్షలాది మంది పట్టభద్రులను తయారు చేసిన వాణీ దేవీ అభ్యర్థిత్వం పై ప్రత్యర్థులు సైతం విమర్శలు చేసే పరిస్తితి లేదు అని వ్యాఖ్యానించారు. అయితే బ్రాహ్మణుల సంక్షేమం కొరకు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కృషి చేస్తున్నారు అని కేటీఆర్ అన్నారు. అయితే ఈ సారి ఎమ్మెల్సి ఎన్నికల్లో ఎవరు గెలుస్తారు అన్న దాని పై సర్వత్రా ఆసక్తి నెలకొంది.