జానారెడ్డిని ఇంకా ముంచుతారు.. మంత్రి తలసాని హాట్ కామెంట్స్..!

Friday, April 9th, 2021, 01:47:29 AM IST


తెలంగాణలో నాగార్జున సాగర్ ఉప ఎన్నిక ప్రచారం హోరాహోరీగా సాగుతుంది. ప్రధానంగా అధికార పార్టీ టీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్యనే ఎక్కువ పోటీ కనిపిస్తుండడంతో రెండు పార్టీల నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తుంది. అయితే నేడు సాగర్ ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా హాలియాలో మీడియా సమావేశంలో మాట్లాడిన మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ 35 ఏళ్ళుగా కాంగ్రెస్ నేత జానారెడ్డి ప్రజలను మోసం చేస్తున్నారని అన్నారు.

అయితే ప్రజలను చైతన్యం చేయడానికే టీఆర్ఎస్ నాయకులు వచ్చారని మంత్రి తలసాని చెప్పుకొచ్చారు. జానారెడ్డి ఇప్పటికే మునిగి ఉన్నారని, కాంగ్రెస్ నాయకులు ఇంకా ఆయనను ముంచుతారని అన్నారు. ఈ ఉప ఎన్నికలో టీఆర్ఎస్ అభ్యర్థి నోముల భగత్ అత్యధిక మెజార్టీతో గెలుస్తారని ధీమా వ్యక్తం చేశారు. 2014కు ముందు యువత, రైతుల ఆత్మహత్యలపై పరిశీలన చేసుకోవాలని అన్నారు. యువత తొందర పడి ప్రాణాలు తీసుకొవద్దని, త్వరలోనే 50 వేల ఉద్యోగాలకు ప్రభుత్వం నోటిఫికేషన్ ఇవ్వబోతుందని మంత్రి తలసాని అన్నారు.