చంద్రబాబు, అతని కొడుకు పప్పునాయుడు రాబందులు – ఎంపీ విజయసాయి రెడ్డి

Sunday, March 7th, 2021, 09:30:16 AM IST

తెలుగు దేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పై వైసీపీ కీలక నేత, ఎంపీ విజయసాయి రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు ఎన్ని డ్రామాలు ఆడినా జీవిఎంసి ఎన్నికల్లో వైసీపీ భారీ విజయం సాధిస్తుంది అంటూ ధీమా వ్యక్తం చేశారు.స్థానిక ఎన్నికల తర్వాత తెలుగు దేశం పార్టీ క్లోజ్ అవుతుంది అని విమర్శించారు. అయితే పురపాలక, కార్పొరేషన్ ఎన్నికల్లో ఒక్క చోట కూడా తెలుగు దేశం పార్టీ గెలిచే అవకాశం లేదు అని తేల్చి చెప్పారు. అయితే జెడ్పీటీసీ ఎన్నికల్లో సైతం 85 నుండి 90 శాతం స్థానాల్లో విజయం సాధిస్తాం అని ధీమా వ్యక్తం చేశారు విజయసాయి రెడ్డి. చంద్రబాబు ఎన్ని మాయమాటలు, అబద్ధాలు చెప్పినప్పటికీ ప్రజలు విశ్వసించే అవకాశం లేదని, చంద్రబాబు సినిమా కి ప్రజలు ముగింపు పలకబోతున్నారు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు, అతని కుమారుడు పప్పు నాయుడు రాబందులు అంటూ చెప్పుకొచ్చారు.

తెలుగు దేశం పార్టీ హయాంలో పరిశ్రమలు, హౌసింగ్, ఇతరత్రా పేరు మీద భూములను తన అనుయాయులకు దోచి పెట్టారు అంటూ ఆరోపించారు. అంతేకాక భూ దందాలు, ఆక్రమణలు, దొంగతనం గా భూములు రాయించుకోవడం వంటి దుర్మార్గాలకు పాల్పడ్డారు అంటూ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. అందుకే తెలుగు దేశం పార్టీ దొంగల పార్టీ గా ముద్ర పడింది అని వ్యాఖ్యానించారు. పెద్దల రూపంలో ఉన్న ఈ భూ కబ్జా దారులకు మేలు చేసే ఈ ముఠా విశాఖ ను చిద్రం చేసింది అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ ముఠా చెరబట్టిన భూములను ప్రభుత్వం వెనక్కి తీసుకుంటుంటే చంద్రబాబు, ఆయన కొడుకు ఇష్టానుసారం గా మాట్లాడుతున్నారు అని, ఈ రాబందులను తరిమి కొట్టాల్సిన సమయం ఆసన్నమైంది అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.