రానున్న రెండు వారాలు వ్యక్తిగతంగా లాక్‌డౌన్‌ పాటిద్దాం.. నాగ్ అశ్విన్ ట్వీట్..!

Thursday, April 29th, 2021, 06:52:15 PM IST

దేశంలో కరోనా మహమ్మారి కల్లోలం సృష్టిస్తుండడంతో వైరస్ వ్యాప్తికి అడ్డుకట్ట వేసేందుకు పలు రాష్ట్రాలు ఇప్పటికే లాక్‌డౌన్ విధించగా. కొన్ని రాష్ట్రాలు నైట్ కర్ఫ్యూని అమలుచేస్తున్నాయి. అయితే తెలుగు రాష్ట్రాల్లో కూడా ప్రస్తుతం నైట్ కర్ఫ్యూ అమలు చేస్తున్నా త్వరలోనే లాక్‌డౌన్ విధిస్తారని ప్రచారం జోరుగా ప్రచారం జరుగుతుంది. అయితే తాజాగా లాక్‌డౌన్‌పై ప్రముఖ దర్శకుడు ‘మహానటి’ ఫేమ్ నాగ్ అశ్విన్ కీలక వ్యాఖ్యలు చేశారు.

అయితే ప్రస్తుతం పరిస్థితులు దారుణంగా ఉన్నాయని లాక్‌డౌన్‌ ఉన్నా లేకున్నా రానున్న కొద్ది రోజులు ఇంట్లోనే ఉందామని నాగ్ అశ్విన్ పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ట్వీట్ చేసిన ఆయన లాక్‌డౌన్‌పై ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నా తీసుకోకపోయినా రానున్న రెండు వారాలు ప్రతి ఒక్కరం వ్యక్తిగతంగా లాక్‌డౌన్‌ పాటిద్దామని, ప్రస్తుతం ఉన్న పరిస్థితులకు లాక్‌డౌన్‌ సమాధానం కాదని ఎవరైతే అంటున్నారో అలాంటి వారు ఒకసారి ఆసుపత్రులకు వెళ్ళి చూడాలని, అలాగే గడిచిన నెల రోజుల నుంచి వైద్యులు ఎలా సేవలందిస్తున్నారో చూడండని, తప్పనిసరిగా మనందరం వ్యాక్సిన్‌ వేయించుకుందాం, వైద్యులకు కొంత రిలీఫ్‌ని అందిద్దామని అన్నారు.