విజయసాయి అల్లుడికి క‌ట్నంగా చ‌దివించిన 104,108 అంబులెన్సులేవి – నారా లోకేశ్

Monday, May 3rd, 2021, 07:50:33 PM IST


ఏపీలో కరోనా పరిస్థితులపై స్పందించిన టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ జగన్ సర్కార్‌పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. క‌రోనా పంజాకి ఆంధ్ర‌ప్ర‌దేశ్ శ‌వాల‌గుట్ట‌గా మారుతుంటే అభిన‌వ నీరో చ‌క్ర‌వ‌ర్తి జగన్ తాడేప‌ల్లి ఇంట్లో త‌న వ్య‌క్తిగ‌త ఫిజియోథెర‌పిస్ట్ గురుమూర్తికి శాలువాలు క‌ప్పుతున్నారని, విజ‌య‌వాడ‌లో ఊరేగించి విజయసాయి రెడ్డి అల్లుడికి క‌ట్నంగా చ‌దివించిన 104,108 అంబులెన్సులేవీ అని ప్రశ్నించారు.

నీ బంధువుల‌కు క‌ట్ట‌బెట్టిన కాల్ సెంట‌ర్ ఏమైంది? ఫోన్‌చేసిన 3 గంట‌ల్లో బెడ్ కాదు క‌దా! శ్మ‌శానంలో పాడె కూడా దొర‌క‌డంలేదు. విజ‌య‌వాడ‌లో క‌రోనా సోకిన వ‌ల‌స‌కూలీ అసిరినాయుడి ఆరోగ్యం ఎలా వుందో తెలుసుకోని ఆరోగ్యశాఖ‌కి ఏం అనారోగ్య‌మొచ్చింది అని అన్నారు. వ‌ల‌సొచ్చిన న‌గ‌రం పొమ్మంటే, ప్రాణాలు అర‌చేతిలో ప‌ట్టుకుని సొంతూరు జి సిగ‌డాం మండ‌లం కొయ్యాన‌పేట‌ ప‌ల్లెకి పోతే, స్థానికులు ఊర్లోకి రానివ్వ‌క‌పోతే క‌నీసం ప‌ట్టించుకోని నీ వ‌లంటీర్లు ఎక్క‌డ‌కి పోయారని అన్నారు. భార్యా, పిల్ల‌ల ముందే అసిరినాయుడు అనాథ‌లా క‌న్నుమూశాడు. మాన‌వ‌త్వంలేని ముఖ్య‌మంత్రీ! నీ చేత‌కాని పాల‌న‌వ‌ల్లే ఈ అన్యాయ‌మైన అకాల‌పు చావులు అని మండిపడ్డారు.