హోమ్ క్వారంటైన్ లో ప్రభాస్… రాధే శ్యామ్ షూటింగ్ కి బ్రేక్!

Wednesday, April 21st, 2021, 11:30:51 PM IST

యంగ్ రెబల్ స్టార్, బాహుబలి ప్రభాస్ ప్రస్తుతం హోమ్ క్వారంటైన్ లో ఉన్నాడు. తన వ్యక్తిగత మేకప్ ఆర్టిస్ట్ కి కరోనా వైరస్ సోకడం తో ప్రభాస్ ముందు జాగ్రత్త చర్యగా ఐసోలేషన్ లో ఉన్నాడు. దేశ వ్యాప్తంగా కరోనా వైరస్ మహమ్మారి రెండవ దశ తీవ్రంగా ఉంది. ఈ మహమ్మారి కారణంగా దేశం లో నిన్న ఒక్క రోజే 2,000 మందికి పైగా ప్రాణాలను కోల్పోయారు. అయితే ఈ మహమ్మారి తీవ్రత కొనసాగుతూనే ఉండటం పట్ల ఇప్పటికే ప్రజలు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే ప్రభాస్ క్వారంటైన్ లోకి వెళ్ళడం తో రాధే శ్యామ్ చిత్ర షూటింగ్ కి బ్రేక్ పడింది. రాధే శ్యామ్ చిత్రం చివరి షెడ్యూల్ షూటింగ్ జరుపుకుంటుంది. అయితే ఈ కరోనా వైరస్ మహమ్మారి తీవ్రత కొనసాగుతూనే ఉండటం తో షూటింగ్ కి బ్రేక్ ఇచ్చినట్లు తెలుస్తోంది.

అయితే ప్రభాస్ వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. రాధే శ్యామ్ తో పాటుగా అటు సలార్, ఆదిపురుష్ చిత్రాలు కూడా లైన్ లో పెట్టారు. ఇప్పటికే ఈ రెండు చిత్రాలు కూడా షూటింగ్ ను ప్రారంభించాయి. అయితే ప్రభాస్ హోమ్ క్వారంటైన్ కి వెళ్ళడం తో వీటన్నిటికీ బ్రేక్ పడింది.