బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల గురించి అప్పటి పీకే చేసిన ట్వీట్ వైరల్…ఎందుకంటే?

Sunday, May 2nd, 2021, 08:00:51 PM IST

పశ్చిమ బెంగాల్ లో అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో తృణమూల్ కాంగ్రెస్ విజయం వైపు దూసుకు పోతుంది. అయితే తాజాగా వస్తున్నటువంటి ఫలితాల్లో తృణమూల్ కాంగ్రెస్ పార్టీ స్పష్టమైన ఆధిక్యాన్ని కనబరుస్తుంది. అయితే ప్రస్తుతం 200 కి పైగా స్థానాల్లో ఆ పార్టీ ఆధిక్యాన్ని సంపాదించింది. అక్కడి ఎన్నికల్లో జాతీయ పార్టీ అయిన బీజేపీ రెండవ స్థానం లో కొనసాగుతుంది. అయితే ఈ ఎన్నికల గురించి గతం లో ఎన్నికల వ్యూహకర్త అయిన ప్రశాంత్ కిషోర్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

బెంగాల్ లో బీజేపీ రెండంకెలు కూడా దాటలేదు అంటూ పీకే చేసిన ట్వీట్ ను ఇప్పుడు సోషల్ మీడియాలో నెటిజన్లు తెగ షేర్ చేస్తున్నారు. అయితే ఇప్పుడు ప్రస్తుత పరిస్థితి కూడా అలానే ఉండటం తో పికే ట్వీట్ వైరల్ గా మారింది. బీజేపీ రెండు స్థానాల్లో విజయం సాధించగా మరో 85 చోట్ల ఆధిక్యం లో కొనసాగుతోంది. అదే విధంగా తృణమూల్ కాంగ్రెస్ పార్టీ 10 స్థానాల్లో గెలుపొందగా, మరో 191 స్థానాల్లో ఆధిక్యాన్ని సంపాదించింది.