వకీల్ సాబ్ తో భారీ ప్లాన్ చేస్తున్న దిల్ రాజు

Monday, March 29th, 2021, 04:00:56 PM IST

పవన్ కళ్యాణ్ హీరో గా నటిస్తున్న వకీల్ సాబ్ చిత్రం ఏప్రిల్ 9 వ తేదీన విడుదలకు సిద్దం అవుతోంది. అయితే వేణు శ్రీ రామ్ దర్శకత్వం లో తెరకెక్కుతున్న ఈ చిత్రం కి సంబంధించిన ట్రైలర్ ఈ రోజు సాయంత్రం ఆరు గంటల కి విడుదల కానుంది. అభిమానులు ఇప్పటికే #vakeelsaabtrailerday పేరిట సోషల్ మీడియా లో ట్రెండ్ చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ దాదాపు మూడు సంవత్సారాల తర్వాత వకీల్ సాబ్ తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. అయితే ఈ చిత్రానికి భారీ బడ్జెట్ లేకపోయినా, పవన్ కళ్యాణ్ హీరో గా చేస్తుండటం తో సినిమా పై భారీ అంచనాలు నెలకొన్నాయి.

అయితే ఈ చిత్ర నిర్మాత దిల్ రాజు వకీల్ సాబ్ తో భారీ ప్లాన్ చేస్తున్నట్లు సినీ పరిశ్రమ లో వార్త చెక్కర్లు కొడుతుంది. విడుదల తేదీ కి ముందు రోజున వైజాగ్. లో మిడ్ నైట్ షో పేరిట మొత్తం మూడు షో లను ప్రదర్శించనున్నారు. అయితే ఇందు కోసం టికెట్ ధరలను విపరీతంగా పెంచారు. మిడ్ నైట్ షో టికెట్ ధర ఒకటి 1500 రూపాయలు ఉన్నట్లు తెలుస్తోంది. అదే విధంగా బెన్ ఫిట్ షో టికెట్ ధర 500 రూపాయలకు ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. ఇంకా మొదటి వారానికి టికెట్ ధర ను 200 రూపాయలు గా పెట్టినట్లు తెలుస్తోంది. అయితే పవన్ కళ్యాణ్ కి ఉన్న క్రేజ్ దృష్ట్యా నిర్మాత దిల్ రాజు ఈ ప్లాన్ చేసినట్లు సమాచారం. అయితే పవన్ కళ్యాణ్ ఎన్నడూ లేని విధంగా ఈ సినిమా కి 50 కోట్ల రూపాయల వరకు రెమ్యునరేషన్ తీసుకున్నట్లు తెలుస్తోంది. బాలీవుడ్ లో పింక్ చిత్రం బ్లాక్ బస్టర్ విజయం సాధించిన సంగతి తెలిసిందే. అందులో అమితాబ్ బచ్చన్ నటించిన పాత్రలో పవన్ కళ్యాణ్ చేస్తున్నారు. ఈ చిత్రం లో అంజలి, నివేద థామస్, అనన్య కీలక పాత్రల్లో నటిస్తున్నారు. పవన్ సరసన శృతి హాసన్ నటించనుంది. ఈ చిత్రానికి సంగీతం తమన్ అందిస్తున్నారు.