ఎస్ఈసీ హౌస్ మోషన్ పిటీషన్ పై నేడు హైకోర్ట్ లో విచారణ!

Wednesday, April 7th, 2021, 08:38:58 AM IST

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో జరగాల్సిన ఎంపిటిసి మరియు జెడ్పీటీసీ ఎన్నికల విషయం లో హైకోర్ట్ స్టే ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే సుప్రీం కోర్టు ఆదేశాల ప్రకారం నాలుగు వారాల గడువు అమలు చేయలేదు అని స్టే ఇవ్వడం జరిగింది. అయితే తదుపరి విచారణ ను ఈ నెల 15 వ తేదీ కి వాయిదా వేస్తూ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం నిర్ణయం తీసుకుంది. అయితే ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర హైకోర్టు డివిజన్ బెంచ్ లో రాష్ట్ర ఎన్నికల కమిషన్ హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. పరిషత్ ఎన్నికల పై సింగిల్ బెంచ్ ఆదేశాలను సవాల్ చేస్తూ ఈ పిటిషన్ వేయడం జరిగింది.అయితే ఇందుకు సంబంధించిన విచారణ నేడు జరగనుంది.

అయితే రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నీలం సాహ్ని పరిషత్ ఎన్నికల విషయం లో విడుదల చేసిన నోటిఫికేషన్ పట్ల బీజేపీ, జన సేన, టీడీపీ లు అభ్యంతరాలు వ్యక్తం చేశాయి. ఈ మేరకు రాష్ట్ర హైకోర్టు లో విచారణ జరపగా, నిన్న పరిషత్ ఎన్నికల పై స్టే విధించిడం జరిగింది. అయితే ఉన్నత న్యాయస్థానం ఆదేశాలను సవాల్ చేస్తూ రాష్ట్ర ఎన్నికల కమిషన్ వేసిన పిటిషన్ విచారణ లో ఏం జరుగుతుంది అనేది నేడు ఉత్కంఠ గా మారింది.