భారత్‌లో కొత్తగా మరో 3,26,098 కరోనా కేసులు..!

Saturday, May 15th, 2021, 11:47:41 AM IST


భారత్‌లో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతోంది. కేసుల సంఖ్యలో కాస్త తగ్గుదల కనిపిస్తున్నా, మరణాల సంఖ్య మాత్రం ఏ మాత్రం తగ్గడం లేదు. అయితే గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 3,26,098 కొత్త కరోనా కేసులు నమోదు అయ్యాయి. ఇక కరోనా బారిన పడి కొత్తగా 3,890 మంది మృతి చెందారు. దీంతో దేశంలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 2,43,72,907కి చేరింది.

అయితే ప్రస్తుతం అందులో 36,73,802 యాక్టివ్ కేసులు ఉండగా, 2,04,32,898 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఇక ఇప్పటివరకు మొత్తం 2,66,207 మంది కరోనా బారిన పడి చనిపోయారు. ఇదిలా ఉంటే గడిచిన 24 గంటల్లో దేశంలో మొత్తం 3,53,299 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. ఇక దేశంలో కరోనా రికవరీ రేటు 83.8 శాతం ఉండగా, మరణాల రేటు 1.1 శాతంగా ఉన్నట్టు తెలుస్తుంది.