ఎస్సీ, ఎస్టీలకి ఈటెల నష్టం చేశారు – మంత్రి కొప్పుల ఈశ్వర్

Tuesday, May 4th, 2021, 03:01:07 PM IST

Etela-Rajender
తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మాజీ మంత్రి ఈటెల రాజేందర్ పై మంత్రులు వరుసగా ఘాటు వ్యాఖ్యలు చేస్తున్నారు. అయితే ముఖ్యమంత్రి కేసీఆర్ పై, ప్రభుత్వం పై ఈటెల రాజేందర్ ఇష్టం వచ్చినట్లు మాట్లాడటం సరికాదు అంటూ మంత్రి కొప్పుల ఈశ్వర్ తెలిపారు. అయితే తెలంగాణ ఉద్యమం లో ఉన్నవారే పదవుల్లో ఉన్నారు అంటూ చెప్పుకొచ్చారు. అయితే ఎల్పీ నాయకుడి గా ఈటెల రాజేందర్ కి అవకాశం ఇచ్చారు అని వ్యాఖ్యానించారు. అయితే ఈటెల కి మంత్రి పదవి తో పాటుగా కీలక శాఖలు కూడా ఇచ్చారు అంటూ చెప్పుకొచ్చారు. అయితే పార్టీ లో గౌరవం దక్కినా ఈటెల విమర్శలు చేస్తున్నారు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే పార్టీలో ప్రాధాన్యత లేదనడం సత్యదూరం అంటూ విమర్శించారు. అయితే అసైన్డ్ భూములను అమ్మరాదు, కొనరాదు అనే విషయం తెలియదా అంటూ ఈశ్వర్ సూటిగా ప్రశ్నించారు.

అయితే మంత్రి గా పదవీ లో ఉండి అసైన్డ్ భూములను ఎందుకు కొన్నారు అంటూ సూటిగా ప్రశ్నించారు. ఎస్సీ, ఎస్టీలకు మంత్రి ఈటెల రాజేందర్ నష్టం చేశారు అంటూ సంచలన ఆరోపణలు చేశారు. అయితే కుటుంబ అవసరాల కోసం అసైన్డ్ భూములు కొనడం తప్పు కాదా అంటూ సూటిగా ప్రశ్నించారు. దేవరయాంజల్ లో దేవాదాయ భూములను ఎందుకు కొన్నారు అంటూ వరుస ప్రశ్నలు సంధించారు కొప్పుల ఈశ్వర్. అయితే ఆరోపణల పై సమాధానం ఇవ్వకుండా, సీఎం కేసీఆర్ పై విమర్శలు చేస్తున్నారు అని, రెండేళ్లు గా ఈటెల పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే ఇతర మంత్రులు సైతం ఈటెల రాజేందర్ వ్యవహరిస్తున్న తీరు ను ఎండగడుతూ ఘాటు వ్యాఖ్యలు చేస్తున్నారు.