వకీల్ సాబ్ ట్రైలర్ వచ్చేసిందోచ్..!

Monday, March 29th, 2021, 07:44:55 PM IST

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా వేణు శ్రీరామ్ దర్శకత్వంలో దిల్ రాజు, బోనీ కపూర్ కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్న సినిమా “వకీల్ సాబ్”. మూడేళ్ల తర్వాత పవన్ నుంచి వస్తున్న సినిమా కావడంతో ఈ సినిమాపై అటు అభిమానులు, ఇటు ఇండస్ట్రీ వర్గాలు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నాయి. ఇప్పటికే విడుదలైన టీజర్, పాటలు సినిమాపై మరిన్ని అంచనాలను పెంచేశాయి. అయితే ఏప్రిల్‌ 9న గ్రాండ్‌గా విడుదల కాబోతోన్న ఈ చిత్రానికి సంబంధించి తాజాగా ట్రైలర్‌ను రిలీజ్ చేసింది చితృ బ్రందం.

అయితే ట్రైలర్‌ను చూసినట్టయితే న్యాయం కోసం పవన్ పోరాడుతాడన్న విషయం క్లారిటీగా అర్ధమయ్యింది. టైటిల్‌కి తగినట్లే కోర్టు సీన్‌తో స్టార్ట్ అయిన ట్రైలర్ పవన్‌ కళ్యాణ్, ప్రకాష్‌ రాజ్‌ ల మధ్య వాద, ప్రతివాదనలతో దద్దరిల్లిపోయింది. అన్యాయంగా కేసులో బుక్కయిన ముగ్గురు అమ్మాయిలకు పవన్ అండగా నిలిచి వారిని ఆ కేసు నుంచి ఎలా బయటపడేశాడన్నదే సినిమా స్టోరీ అన్నట్టు తెలుస్తుంది.