మౌనం వీడి చర్యలు తీసుకో ఓ దొరా.. కేసీఆర్‌పై రాములమ్మ ఫైర్..!

Tuesday, April 6th, 2021, 11:45:31 PM IST


తెలంగాణలో ఒకవైపు అరాచకం… మరోవైపు ప్రజల దైన్య స్థితి ఏకకాలంలో కరాళ నత్యం చేస్తూ పరిపాలన పూర్తిగా పక్కదారి పట్టిందని బీజేపీ నాయకురాలు విజయశాంతి ఆరోపించారు. మంత్రులే స్వయంగా భూకబ్జాలు, బెదిరింపులకు పాల్పడినట్లు ఆడియోలు బయటకొస్తున్నాయని, మేమేం తక్కువ తిన్నామా… అన్నట్టు నలుగురు ఎమ్మెల్యేలు డ్రగ్స్ పార్టీలకు సంబంధించిన తీవ్ర ఆరోపణల్లో చిక్కుకున్నారని, నోరు విప్పితే చాలు తెలంగాణలో గొప్ప పరిపాలన సాగుతోందంటూ బాకాలూదే సీఎం గారికి వీరిపై చర్యలు తీసుకునే దమ్ముందా? ఆ మంత్రిని తొలగించగలరా? ఆ ఎమ్మెల్యేలపై కనీసం పార్టీపరంగానైనా చర్యలు తీసుకోగలరా? అవినీతి, అనైతిక వ్యవహారాలు ఇలా ఉంటే.. ప్రత్యేక రాష్ట్రం వచ్చినా ఉద్యోగాలు రాని దైన్యంలో తెలంగాణ యువకులు బలవన్మరణాలకు పాల్పడుతున్నారని అన్నారు.

ఇక కరోనా కట్టడి విషయంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం సరే సరి. రాష్ట్రంలో రోజుకు 7,600 ఆర్టీపీసీఆర్ టెస్టులు చెయ్యాలని కేంద్రం సూచిస్తే ఇవి నాలుగైదు వేలు దాటని పరిస్థితి. జిల్లాల్లోని సర్కారు దవాఖానల్లో టెస్టులకు మెషీన్లు లేక ప్రయివేటుకు పంపేస్తున్నారని, కరోనా కట్టడికి వైన్ షాపులు, బార్లు, పబ్‌లు, థియేటర్లపై ఎందుకు ఆంక్షలు విధించడం లేదో చెప్పాలని, ఆర్టీపిసిఆర్ టెస్టులు తక్కువ చేస్తున్నారని హైకోర్టు తీవ్రంగా మందలించినా ఈ రాతి గుండె సర్కారువారు మారరు. ఈ పాలకుల నుంచి ఇంతకంటే ఎక్కువ ఆశించడం అత్యాశే అని ఎద్దేవా చేశారు. మందు షాపు కి రాని కరోనా బడికి వస్తుంది,ఒక పక్క నిరుద్యోగ బల్వమరనాలు మరో పక్క అరో కొర కరోనా పరీక్షలు డ్రగ్స్ కేస్ లో అనుమానితులుగా వున్న వాళ్ళని కనీసం చర్యలు కూడా తీసుకోకుండా చౌధ్యం చూస్తున్నాడు ఈ దొర, మౌనం వీడి చర్యలు తీసుకో ఓ దొరా అని విజయశాంతి అన్నారు.