పవన్ కళ్యాణ్ బీజేపీ తో కలవడం సిగ్గుచేటు – ఎమ్మెల్సీ రామచంద్రయ్య

Thursday, April 8th, 2021, 07:43:58 AM IST

తిరుపతి పార్లమెంట్ ఉపఎన్నిక నేపథ్యం లో అధికార పార్టీ వైసీపీ కి చెందిన ఎమ్మెల్సీ సి. రామచంద్రయ్య ప్రతి పక్ష పార్టీ నేతల పై ఘాటు వ్యాఖ్యలు చేశారు. తిరుపతి వేదిక గా ప్రత్యేక హోదా ఇస్తామని మోడీ తో పాటు ఆయన జంట పక్షులు పవన్, చంద్రబాబు పోటీపడి ప్రకటించి రాష్ట్ర ప్రజలను తీవ్రంగా ముంచారు అంటూ రామచంద్రయ్య విమర్శించారు. తిరుపతి ఉపఎన్నికలో వైసీపీ ఎంపీ అభ్యర్ధి అయిన డాక్టర్ గురుమూర్తి ను గెలిపించుకుందాం అని వ్యాఖ్యానించారు. అయితే చంద్రబాబు నాయుడు బలిజల్ని ఓటు బ్యాంకు గా చూసి ఇన్నాళ్లు మాయమాటలతో మోసగించారు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే అధికారం లో ఉన్నన్నాళ్లు బలిజలు చంద్రబాబు కి గుర్తు రారు అంటూ చెప్పుకొచ్చారు. అయితే ఈ మేరకు ప్రతి పక్ష పార్టీ ల పై సి.రామచంద్రయ్య నిప్పులు చెరిగారు.

తిరుపతి పార్లమెంట్ ఉపఎన్నిక లో చంద్రబాబు పార్టీ కి ఎవరు ఓటు వేసినా అది బూడిద లో పోసిన పన్నీరు లా వృథా అవుతుంది అని ఘాటు వ్యాఖ్యలు చేశారు. అయితే ప్రత్యేక హోదా నినాదం బలపడలన్నా, విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణ కు వ్యతిరేకంగా మన నినాదం నిలవాలన్నా బీజేపీ కి డిపాజిట్లు గల్లంతయ్యేలా తీర్పు ఉండాలి అంటూ సూచించారు. అయితే తనది కమ్యూనిస్ట్ సిద్దాంతం అని చెప్పుకొనే పవన్ కళ్యాణ్ బీజేపీ తో కలవడం సిగ్గుచేటు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ పార్టీలకు ఓటు అడిగే హక్కు లేదు అని, ప్రతి ఒక్కరూ కూడా వైసీపీ ను బలపరచి ఫ్యాన్ గుర్తుకు ఓటేయాలని అభ్యర్థించారు.