బాలకృష్ణ దాడి చేసింది కార్యకర్త పై కాదు, హిందూపురం ప్రజల పై – వైసీపీ ఎంపీ

Sunday, March 7th, 2021, 10:19:45 PM IST

తెలుగు దేశం పార్టీ నేతల పై వైసీపీ నేతలు వరుస విమర్శలు గుప్పిస్తున్నారు. ప్రముఖ టాలీవుడ్ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ పై వైసీపీ నేత, ఎంపీ గోరంట్ల మాధవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ నిరాశ, నిస్పృహ లతో సొంత పార్టీ కార్యకర్తల పై దాడి చేస్తున్నారు అని అన్నారు. బాలకృష్ణ దాడి చేసింది కార్యకర్త పై కాదు, హిందూపురం ప్రజల పై దాడి చేశారు అంటూ చెప్పుకొచ్చారు. అంతేకాక పంచరైన సైకిల్ ను సైకిల్ ను చంద్రబాబు వయోభారంతో తొక్కుతున్నారు అంటూ విమర్శించారు. అయితే ఇటీవల జరిగిన సంఘటన పట్ల వైసీపీ నేతలు బాలకృష్ణ తీరును ఎండగడుతూ ఘాటు వ్యాఖ్యలు చేస్తున్నారు. బాలయ్య టీడీపీ నేతల పైనే దుడుకు గా వ్యవహరిస్తుండటం తో వైసీపీ నేతలు ఇలా వరుస విమర్శలు చేస్తున్నారు.