కేసీఆర్‌కు కాంట్రాక్ట్ ఉద్యోగాలే ముద్దుగా కనిపిస్తున్నయి – వైఎస్ షర్మిల

Tuesday, May 18th, 2021, 05:17:13 PM IST


తెలంగాణలో కొత్త రాజకీయ పార్టీ ఏర్పాటు చేయబోతున్న వైఎస్ షర్మిల గత కొద్ది రోజులుగా టీఆర్ఎస్ పార్టీపై, సీఎం కేసీఆర్‌పై నిప్పులు చెరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే కాంట్రాక్టుపై వైద్య సిబ్బందిని నియమించాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై స్పందించిన వైఎస్ షర్మిల ‘అన్నింటా కాంట్రాక్ట్ పోస్టులే అయితే.. ఇక సీఎం పదవి కూడా కాంట్రాక్టు కింద పెట్టుకుంటే పోలే..” అని ముచ్చట చెప్పిన కేసీఆర్ సారుకు కూడా కాంట్రాక్ట్ ఉద్యోగాలే ముద్దుగా కనిపిస్తున్నాయని అన్నారు.

అయితే 2017లో 3311 స్టాఫ్ నర్సులకు నోటిఫికేషన్ ఇచ్చిన ప్రభుత్వం, ఆర్హత సాధించిన ఇంకా 658 మందికి మాత్రం ఉద్యోగాలు కల్పించలేదు. ఇప్పుడు కాంట్రాక్టు పద్దతిపై నర్సింగ్ సిబ్బందిని తీసుకోవాలనుకొనే ప్రభుత్వం, ముందు ఆర్హత సాధించిన 658 మందిని పర్మినెంట్ గా రిక్రూట్ చేయాలని షర్మిల డిమాండ్ చేశారు.