రివ్యూ : ‘వి’

Nani_V_Movie

 

నాని, హీరో సుధీర్ బాబు కలయికలో టాలెంటెడ్ డైరెక్టర్ మోహన్ కృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో రూపొందిన సినిమా ‘వి’. అదితి రావ్ హైదరి, నివేదా థామస్ హీరోయిన్స్ గా నటించిన ఈ సినిమాని ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మించారు. కాగా తాజాగా ఈ చిత్రం ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ చిత్రం ఎలా ఉందో రివ్యూషలోకి వెళ్లి తెలుసుకుందాం!

కథ

ఆర్మీలో పని చేసిన విష్ణు (నాని) ఇన్స్ పెక్టర్ ప్రసాద్ అనే అతన్ని చంపి మరో నలుగురును చంపుతా దమ్ము ఉంటే ఆపు అని డీసీపీ ఆదిత్యతో ఛాలెంజ్ చేస్తాడు. అప్పటికే సూపర్ కాప్ గా డీసీపీ ఆదిత్య (సుధీర్ బాబు) గ్యారెంటీ మెడల్ తో డిపార్ట్మెంట్ లోనే వెరీ సక్సెస్ ఫుల్ ఆఫీసర్ గా పేరుప్రఖ్యాతులు తెచ్చుకుంటాడు. ఈ క్రమంలోనే అపూర్వ (నివేధా) అతని కథ రాయడానికి వచ్చి అతనితో ప్రేమలో పడుతుంది. కానీ సడెన్ గా ఆదిత్య జీవితంలోకి విష్ణు వచ్చి ఛాలెంజ్ చేస్తాడు. ఆ ఛాలెంజ్ ను పర్సనల్ గా తీసుకున్న ఆదిత్య, విష్ణు హత్యలు చేయకుండా ఆపడానికి ఎలాంటి ప్రయత్నాలు చేసాడు ? అసలు ఆర్మీలో పని చేసిన విష్ణు అత్యంత దారుణంగా ఎందుకు హత్యలు చేస్తున్నాడు ? ఈ హత్యలకు సాహెబా (అదితి రావ్ హైదరి)కి సంబంధం ఏమిటి ? లాంటి విషయాలు తెలియాలంటే ఈ సినిమా చూడాల్సిందే.

 

విశ్లేషణ :

నాని ఈ సినిమాలో కూడా తన పాత్రకు తగ్గట్లు… ఎప్పటిలాగే తన రియలిస్టిక్ యాక్టింగ్ తో ఆకట్టుకున్నాడు. ముఖ్యంగా ఇలాంటి క్లిష్టమైన పాత్రలో నాని నటించిన విధానం సినిమాకే హైలెట్ అనిపిస్తోంది. నాని విలనిజానికి ధీటుగా ఉండే ఒక డీసీపీ పోలీస్ ఆఫీస‌ర్ హీరోయిజాన్ని సుధీర్‌బాబు కూడా అంతే సీరియస్ టోన్ లోనే పలికించాడు. ఇక నాని, సుధీర్ బాబు మ‌ధ్య నువ్వా నేనా? అనేలా వ‌చ్చే యాక్ష‌న్ అండ్ ఛేజింగ్ స‌న్నివేశాలు సినిమాలో ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయి. ఇక కీలక పాత్రల్లో నటించిన హీరోయిన్స్ ‘అదితి రావ్ హైదరి’, ‘నివేదా థామస్’ అవలీలగా నటించడంతో పాటు అందంగా కనిపిస్తూ ఆకట్టుకున్నారు.

అయితే దర్శకుడు ఇంద్రగంటి మోహన్ కృష్ణ రాసుకున్న ట్రీట్మెంట్ కొన్ని చోట్ల ఇంకా బెటర్ గా ఉంటే బాగుండేది అనే ఫీలింగ్ కలుగుతుంది. అలాగే ఇద్దరి హీరోల లవ్ ట్రాక్స్ కూడా వీక్ గా ఉన్నాయి.ఇక నాని – అతిధి మధ్య సాగిన లవ్ ట్రాక్ పాత అనేక లవ్ సినిమాల వాసన కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. ఇంద్రగంటి సినిమాని ఇంట్రస్టింగ్ గా మొదలు పెట్టినా.. కథనంతో సినిమాని నెమ్మదిగా సాగతీస్తూ మధ్యమధ్యలో యాక్షన్ పెట్టి నెట్టుకొచ్చాడు.

అలాగే ఫస్టాఫ్ లో వచ్చే ల్యాగ్ సీన్స్ ను కూడా తగ్గించుకుని ఉండి ఉంటే, సినిమాకి ఇంకా బెటర్ అవుట్ ఫుట్ వచ్చి ఉండేది. మొత్తంగా దర్శకుడు సస్పెన్స్ అండ్ ఎమోషనల్ ఎలిమెంట్స్ తో ఆకట్టుకున్నా.. ఓవరాల్ గా సినిమా పరంగా పూర్తి స్థాయిలో ఆకట్టుకులేకపోయారు. ఇక సాంకేతిక నిపుణుల గురించి మాట్లాడుకుంటే.. సంగీత దర్శకుడు అమిత్ త్రివేది అందించిన సాంగ్స్ బాగాలేదు. తమన్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగుంది. ఎడిటింగ్ కూడా బాగాలేదు. సినిమాటోగ్రఫీ కూడా ఆకట్టుకున్నేలా ఉంది. నిర్మాత దిల్ రాజు పాటించిన నిర్మాణ విలువలు చాల బాగున్నాయి.

 

ప్లస్ పాయింట్స్ :

నాని విలక్షణ నటన
సుధీర్ బాబు క్యారెక్టర్
య్యాక్షన్ సీక్వెన్సెస్
కొన్ని సస్పెన్స్ సీన్స్
ఎమోషనల్ గా సాగే క్లైమాక్స్

 

మైనస్ పాయింట్స్ :

సాంగ్స్
కథాకథనాలు,
కీలక సీన్స్ స్లోగా సాగడం
రివేంజ్ డ్రామా రొటీన్ గా అనిపించడం,
కొన్ని చోట్ల లాజిక్ మిస్ అవ్వడం.
అలాగే ఇంట్రెస్ట్ మిస్ అవ్వడం

తీర్పు :

వి అంటూ యాక్షన్ థ్రిల్లర్ గా వచ్చిన ఈ చిత్రం కథాంశం పరంగా అలాగే యాక్షన్ పరంగా ఆకట్టుకున్నా.. ఓవరాల్ గా సినిమా మాత్రం ఆకట్టుకోలేకపోయింది. కథకథనాలు బాగా స్లోగా సాగుతూ సినిమా బోర్ గా కొడుతొంది. అయితేనేచురల్‌ స్టార్‌ నాని – సుధీర్ బాబు తమ నటనతో అలాగే కొన్ని థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో పర్వాలేదనిపించారు. కానీ, సినిమాలో లవ్ ట్రాక్స్ బోర్ గా సాగడం, సాంగ్స్ కూడా బాగాలేకపోవడం, అలాగే కొన్ని సీన్స్ ఆసక్తికరంగా సాగకపోవడం, మరియు కొన్ని చోట్ల ప్లే కూడా బాగా స్లోగా సాగడంతో సినిమా ఫలితం దెబ్బతింది. నాని అభిమానులతో పాటు యాక్షన్ లవర్స్ కు తప్ప..
ఇక మొత్తానికి ఈ చిత్రం ఏ వర్గం ప్రేక్షకులను ఆకట్టుకోదు.

Rating : 2.5/5