హర్‌ప్రీత్ భల్లే భల్లే.. ఆర్సీబీపై పంజాబ్ సూపర్ విక్టరీ..!

Saturday, May 1st, 2021, 01:00:40 AM IST

ఐపీఎల్ 2021లో భాగంగా నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా పంజాబ్ కింగ్స్-రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు జట్ల మధ్య జరిగిన పోరులో పంజాబ్ కింగ్స్ 34 పరుగుల తేడాతో సూపర్ విక్టరీ సాధించింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన పంజాబ్ కింగ్స్‌కు ఓపెనర్, కెప్టెన్ కేఎల్ రాహుల్ (91), యూనివర్సల్ బాస్ క్రిస్‌ గేల్‌ (46) పరుగులతో రాణించడంతో నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి పంజాబ్ 179 రన్స్ చేసింది. ఆర్సీబీ బౌలర్లలో కైల్‌ జేమిసన్‌ 2 వికెట్లు తీయగా, డేనియల్ సామ్స్‌, చాహల్, షాబాజ్ అహ్మద్ తలో వికెట్ తీసుకున్నారు.

అనంతరం 180 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆర్సీబీకి ఆదిలోనే షాక్ తగిలింది. 7 పరుగులు చేసిన ఓపెనర్ పడిక్కల్‌ మెరిడిత్‌ బౌలింగ్‌లో క్లీన్‌బౌల్డ్‌గా వెనుదిరిగాడు. ఆ తర్వాత 180 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆర్సీబీకి ఆదిలోనే షాక్ తగిలింది. 7 పరుగులు చేసిన ఓపెనర్ పడిక్కల్‌ మెరిడిత్‌ బౌలింగ్‌లో క్లీన్‌బౌల్డ్‌గా వెనుదిరిగాడు. కానీ ఆ తర్వాత కెప్టెన్ విరాట్ కోహ్లీ(35), రజత్ పాటిదార్ (31) కాసేపు నిలకడగా ఆడారు. అయితే పంజాబ్ జట్టు తరపున మొదటి మ్యాచ్ ఆడుతున్న యువ స్పిన్నర్ హర్‌ప్రీత్ బ్రార్ ఒకే ఓవర్‌లో కోహ్లీ, గ్లెన్ మ్యాక్స్‌వెల్‌ను అలాగే ఆ తర్వాత ఓవర్‌లో డివిలియర్స్ ను ఔట్ చేసి బెంగళూరును కోలుకోలేని దెబ్బకొట్టాడు. ఆఖరిలో హర్షల్ పటేల్(31) పరుగులు ధాటిగా ఆడినా ఫలితం లేకుండా పోయింది. దీంతో నిర్ణిత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి ఆర్సీబీ 145 పరుగులు మాత్రమే చేయగలిగింది. పంజాబ్ బౌలర్లలో హర్ప్రీత్ బ్రర్‌ 3 వికెట్లతో రాణించగా, రవి బిష్ణోయ్ 2 వికెట్లు, రైలీ మెరిడిత్, మహ్మద్ షమి, క్రిస్ జోర్డాన్‌లకు తలా ఓ వికెట్ దక్కింది. ఇక ఈ విజయంతో పాయింట్ల పట్టికలో పంజాబ్ 5వ స్థానానికి చేరుకుంది.